AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వామ్మో.. కారంతో అభిషేకమా? ఈయన మామూలోడు కాదు సామీ

కారం ఈ పేరు వింటే చాలు ఎవరైనా దూరంగా పారిపోవాల్సిందే. ఎందుకంటే కారం ఘాటు అంతగా ఉంటుంది కాబట్టి. కూరలో చిటికెడు కారం ఎక్కువైతే మన నాలుకకు తగలగానే ఆ కారం మంట నషాలానికి అంటి కళ్ళలో గిర్రున నీళ్ళు తిరుగుతాయి. ఓ బాటిల్ మంచినీళ్లు గొంతులో పోస్తే తప్ప ఆ మంట చల్లారదు. ఇప్పుడు ఎందుకు మనం కారం గురించి మాట్లాడుకుంటున్నామా అనే డౌట్ మీకు వస్తుందా.. అయితే ఈ విషయం మీకు చెప్పాల్సిందే. ఓ స్వామిజీనీ కారంతో భక్తులు..

Andhra Pradesh: వామ్మో.. కారంతో అభిషేకమా? ఈయన మామూలోడు కాదు సామీ
Worship With Chilli Powder
Follow us
B Ravi Kumar

| Edited By: Srilakshmi C

Updated on: Nov 30, 2023 | 7:52 AM

ఏలూరు, నవంబర్‌ 30: కారం ఈ పేరు వింటే చాలు ఎవరైనా దూరంగా పారిపోవాల్సిందే. ఎందుకంటే కారం ఘాటు అంతగా ఉంటుంది కాబట్టి. కూరలో చిటికెడు కారం ఎక్కువైతే మన నాలుకకు తగలగానే ఆ కారం మంట నషాలానికి అంటి కళ్ళలో గిర్రున నీళ్ళు తిరుగుతాయి. ఓ బాటిల్ మంచినీళ్లు గొంతులో పోస్తే తప్ప ఆ మంట చల్లారదు. ఇప్పుడు ఎందుకు మనం కారం గురించి మాట్లాడుకుంటున్నామా అనే డౌట్ మీకు వస్తుందా.. అయితే ఈ విషయం మీకు చెప్పాల్సిందే. ఓ స్వామిజీనీ కారంతో భక్తులు అభిషేకించారు. అభిషేక మంటే ఏదో చిటికెడు కారం కాదు ఒక కేజీ, రెండు కేజీలు అంతకన్నా కాదు ఏకంగా 60 కేజీల కారం భక్తులు కవర్లలో తీసుకువచ్చి ఆ స్వామిని అభిషేకించారు. సాధారణంగా అభిషేకం అంటే ఆలయాల్లో పాలు, పంచామృతాలు, తేనె ఇతరత్ర వాటితో శిలా రూపంలో ఉన్న ఉత్సవమూర్తులకు అభిషేకిస్తారు.

ఇటీవల కాలంలో అయితే రాజకీయ నాయకులు, సినిమా స్టార్ల ఫ్లెక్సీలకు కూడా అభిషేకాలు చేసేస్తున్నారు ఫ్యాన్స్… కానీ ఇక్కడ ఓ స్వామీజీనీ కారంతో శరీరానికి నలుగు పెట్టినట్లు అభిషేకించడం ఆశ్చర్యం కలిగించింది. అంత పెద్ద ఎత్తున కారంతో అభిషేకం చేసిన స్వామి కదలలేదు.. మెదలలేదు. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజంగా జరిగిన యదార్థ ఘటన. ఈ కారాభిషేకం ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడులోని శ్రీ శివ దత్త ప్రత్యంగిరి వృద్ధాశ్రమంలో జరిగింది. ప్రత్యంగరి దేవి ఉపాసకులు శివ స్వామికి గ్రామస్తులు, భక్తులు ఎర్రని కారంతో అభిషేకాన్ని ఘనంగా జరిపారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా శివ స్వామి ప్రత్యంగరి దేవికి పూర్ణాహుతి హోమాన్ని జరిపారు. అనంతరం ఆయన ప్రత్యంగరా దేవిని ఆవాహన చేసుకుని దీపోత్సవాన్ని ప్రారంభించారు. తరువాత దేవి ఆవాహనలో ఉన్న శివ స్వామిని భక్తులు పెద్ద ఎత్తున కారంతో అభిషేకించారు.

ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. సుమారు 60 కేజీల కారంతో శివ స్వామిని అభిషేకించడంతో పాటు వారు వెంట కవర్లలో తెచ్చుకున్న కారాన్ని సైతం ఆయనకు అభిషేకించారు. హిరణ్యకశికుడిని నరసింహస్వామి వధించిన అనంతరం స్వామివారి ఉగ్రరూపాన్ని తగ్గించేందుకు ప్రత్యంగరి దేవి ఉద్భవించిందనీ పురాణాలు చెబుతున్నాయి. అయితే ప్రత్యంగిరీ దేవికి ఎండుమిరపకాయలు అంటే ఎంతో ఇష్టం. అంతేకాక ప్రత్యంగిరీ దేవికి ఎండుమిరపకాయలను మెడలో హారంగా చేసి దండలు వేసి పూజిస్తారు.

ఇవి కూడా చదవండి

అలాంటి ఎండుమిరపకాయలను కారం చేసి ప్రత్యంగిరి ఆవాహనలో ఉన్న శివ స్వామిని అభిషేకిస్తే వారికి బాధలు, కష్టాలు తొలగి శత్రువినాశనం జరిగి, లక్ష్మీ కటాక్షం పొందుతారని, అంతేకాక దేవికి ఇష్టమైన ప్రసాదంగా కారాన్ని ఉపయోగిస్తారనీ, ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో కార్తీక బహుళ తదియ రోజున కారంతో అభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. 29 సంవత్సరాలుగా హైదరాబాదులో కారంతో అభిషేకం నిర్వహిస్తున్నారు. అలాగే ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడు శ్రీ శివ దత్త ప్రత్యంగిరి వృద్ధాశ్రమంలో రెండవ సంవత్సరం కారంతో అభిషేకం చేస్తున్నామని శివ స్వామి అన్నారు. ఈ కారాభిషేక కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.