AP Rains: ఏపీకి తుఫాన్ ముప్పు.. ఈ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు.!
తీరం గుండెల్లో తుఫాన్ బెల్స్ మోగుతున్నాయి. బంగాళాఖాతంలో మాటేసిన అల్పపీడనం మరింత బలపడింది. అది వాయుగుండంగా మారి తుఫాన్ రూపంలో విరుచుకుపడతానంటూ భయపెడుతోంది. దీని ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు, చెన్నయ్ తడిసి ముద్దవుతున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడింది.
తీరం గుండెల్లో తుఫాన్ బెల్స్ మోగుతున్నాయి. బంగాళాఖాతంలో మాటేసిన అల్పపీడనం మరింత బలపడింది. అది వాయుగుండంగా మారి తుఫాన్ రూపంలో విరుచుకుపడతానంటూ భయపెడుతోంది. దీని ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు, చెన్నయ్ తడిసి ముద్దవుతున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడింది. ఇది వాయుగుండంగా మారి… ఆ తర్వాత వాయవ్య దిశగా కదులుతూ శనివారం నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని IMD సూచించింది.
ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళద్దంటూ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో శనివారం నుంచి రాయలసీమ, కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయి. అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ. భారీ వర్షాలకు వరితో పాటు ఇతర పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని, అందువల్ల కోతకు వచ్చిన వరి పంటను వెంటనే కోసి భద్రపరచుకోవాలని రైతులకు అధికారులు సూచించారు. ప్రకాశం, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో జల్లులు పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు నగరం…భారీ వర్షంతో తడిసి ముద్దవుతోంది. ప్రధాన కూడళ్లలో రోడ్లు జలమయం అయ్యాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి.
ఇక అల్పపీడనం ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో చెన్నయ్‌లో పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఈ భారీ వానల ధాటికి చెన్నై శివారు ప్రాంతాలు, తిరువళ్లూరు జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. చెంబరపాక్కం, పుళల్ రిజర్వాయర్లలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. చెంబరపాక్కం నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించారు. పలు ప్రాంతాల్లో వర్షపు నీటితో డ్రైనేజి నీరు కలిసిపోయింది. తాగు నీటి కోసం జనం నానా అవస్థలు పడుతున్నారు. ఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉందంటున్నారు వాతావరణ నిపుణులు. డిసెంబర్ రెండో తేదీ నాటికి బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. ఏపీ తీరం వైపు తుఫాను దిశ, గమనం ఉంటే భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు.