AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nellore: హమ్మయ్య.. పెంచలకోన జలపాతంలో కొట్టుకుపోయిన 11మంది అయ్యప్ప భక్తులు సురక్షితం

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో బుధవారం (నవంబర్‌ 29) పెను ప్రమాదం తప్పింది. పెంచలకోన జలపాతం చూసేందుకు వెళ్లి గల్లంతైన 11 మంది పర్యాటకులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.  వివరాల్లోకి వెళితే.. పెంచలకోనం జలపాతం అందాలను చూసి 11 మంది పర్యాటకులు తిరిగి వస్తుండగా ఒక్కసారిగా ఉధృతి పెరిగింది. దీంతో కొద్ది దూరం పాటు పర్యాటకులు కొట్టుకుపోయారు. అయితే సకాలంలో పోలీసులు,

Nellore: హమ్మయ్య.. పెంచలకోన జలపాతంలో కొట్టుకుపోయిన 11మంది అయ్యప్ప భక్తులు సురక్షితం
Water falls (representative Image)
Follow us
Basha Shek

|

Updated on: Nov 29, 2023 | 7:41 PM

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో బుధవారం (నవంబర్‌ 29) పెను ప్రమాదం తప్పింది. పెంచలకోన జలపాతం చూసేందుకు వెళ్లి గల్లంతైన 11 మంది అయ్యప్ప భక్తులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఒక్కసారిగా ఉధృతి పెరగడంతో కొద్ది దూరం పాటు పర్యాటకులు కొట్టుకుపోయారు. అయితే సకాలంలో పోలీసులు, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని రెస్య్కూ ఆపరేషన్ చేపట్టారు. రోప్‌ల సాయంతో పర్యాటకులను కాపాడారు. సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో పర్యాటకుల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో స్పందించి పెద్ద ప్రమాదం తప్పించిన పోలీసులు, ఫైర్‌ సిబ్బందిని పలువురు ప్రశంసిస్తున్నారు. కాగా కార్తీకమాసం కావడంతో కొంతమంది అయ్యప్ప స్వాములు జలపాతం దగ్గర విహార యాత్రకు వెళ్లారు. జలపాతంలో దిగి ఎంజాయి చేస్తుండగా ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది. అలల తాకిడికి కొట్టుకుపోయారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసు, ఫైర్‌ సిబ్బంది వారిని రక్షించారు. పర్యాటకులు ఏయే ప్రాంతాల నుంచి జలపాతం వద్దకు వచ్చారన్న వివరాలు తెలియాల్సి ఉంది.

అనాథ పిల్లల కోసం ఈ బిగ్ బాస్ బ్యూటీ ఏం చేసిందో తెలుసా? వీడియో
అనాథ పిల్లల కోసం ఈ బిగ్ బాస్ బ్యూటీ ఏం చేసిందో తెలుసా? వీడియో
ఇక పిడుగులను దారి మళ్లించవచ్చు.. శాస్త్రవేత్తల గొప్ప ప్రయోగం
ఇక పిడుగులను దారి మళ్లించవచ్చు.. శాస్త్రవేత్తల గొప్ప ప్రయోగం
ఓటీటీలోకి వచ్చేసిన ఐశ్వర్య రాజేశ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన ఐశ్వర్య రాజేశ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ..
వేసవిలో మామిడి పండు తింటున్నారా.? అనారోగ్యం ఆమడ దూరం..
వేసవిలో మామిడి పండు తింటున్నారా.? అనారోగ్యం ఆమడ దూరం..
సింహాచలం ప్రమాద ఘటనపై ప్రధాని సంతాపం...మృతుల‌ కుటుంబాలకు పరిహారం
సింహాచలం ప్రమాద ఘటనపై ప్రధాని సంతాపం...మృతుల‌ కుటుంబాలకు పరిహారం
అమ్మో ఎంత పెద్ద గుమ్మడి.. కానీ తినటానికి పనికి రాదు
అమ్మో ఎంత పెద్ద గుమ్మడి.. కానీ తినటానికి పనికి రాదు
షుగర్ ఉన్నవారికి ఈ రొట్టెలు చాలా మంచివి.. రోజూ తినొచ్చు
షుగర్ ఉన్నవారికి ఈ రొట్టెలు చాలా మంచివి.. రోజూ తినొచ్చు
విజయనగరం గ్రామ దేవత.. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు.. పైడిమాంబ చరిత్ర..
విజయనగరం గ్రామ దేవత.. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు.. పైడిమాంబ చరిత్ర..
స్వీడన్‌ వీథుల్లో సామూహిక కాల్పులు.. ముగ్గురు మృతి! వీడియో చూశారా
స్వీడన్‌ వీథుల్లో సామూహిక కాల్పులు.. ముగ్గురు మృతి! వీడియో చూశారా
బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఇది తిని చూడండి..!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఇది తిని చూడండి..!