Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kandukuru TDP: టీడీపీలో పెరుగుతున్న ఆశావహులు.. నేనున్నానంటూ దూసుకొచ్చిన అసలు నేత..!

తెలంగాణ ఎన్నికల హడావిడి చల్లబడింది. ఇక ఏపీలో కాక మొదలు కానుంది. రాజకీయ పార్టీలన్నీ ఎలక్షన్ ఫైట్‌కు సిద్దవుతున్నాయి. ఇదే తరుణంలో ఆశావహులు కూడా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. అయితే ఇప్పటిదాకా ఇంచార్జ్‌గా ఉంటూ డబ్బు ఖర్చు చేసిన మా పరిస్థితి ఏంటి అంటూ టెన్షన్ పడుతున్నారు కొందరు నేతలు.

Kandukuru TDP: టీడీపీలో పెరుగుతున్న ఆశావహులు.. నేనున్నానంటూ దూసుకొచ్చిన అసలు నేత..!
Telugu Desam Party
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 29, 2023 | 8:55 PM

తెలంగాణ ఎన్నికల హడావిడి చల్లబడింది. ఇక ఏపీలో కాక మొదలు కానుంది. రాజకీయ పార్టీలన్నీ ఎలక్షన్ ఫైట్‌కు సిద్దవుతున్నాయి. ఇదే తరుణంలో ఆశావహులు కూడా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. అయితే ఇప్పటిదాకా ఇంచార్జ్‌గా ఉంటూ డబ్బు ఖర్చు చేసిన మా పరిస్థితి ఏంటి అంటూ టెన్షన్ పడుతున్నారు కొందరు నేతలు. ఇప్పుడు నెల్లూరు జిల్లా కందుకూరు తెలుగుదేశం పార్టీ నేతలు పరిస్థితి కూడా ఇలానే ఉంది..!

వైసీపీ, టీడీపీ రెండు ప్రధాన రాజకీయ పార్టీలు కీలకంగా భావిస్తున్న జిల్లా నెల్లూరు. ఇక్కడ క్లిన్ స్వీప్ చేయాలన్న వ్యూహంతో ఉన్నాయి రెండు పార్టీలు. టికెట్ల విషయంలో వైసీపీతో పోల్చితే టీడీపీలో ఇంకాస్త కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంది. కందుకూరు టీడీపీలో అయితే టికెట్టు కోసం ఆశావహుల లిస్ట్ రోజు రోజుకు పెరుగుతోంది. 2014 లో వైసీపీ నుంచి గెలిచిన పోతుల రామారావు టీడీపీ అధికారంలోకి రాగానే జంప్ అయిన 23 మంది ఎమ్మెల్యేలలో ఒకరు.

2019 లో మానుగుంట మహిదర్ రెడ్డి వైసీపీ తరపున విజయం సాధించారు. 2019 తర్వాత పోతుల రామారావు వ్యక్తిగత కారణాల వల్ల టీడీపీలో యాక్టివ్‌గా లేరు. దీంతో అక్కడ ఇంటూరి నాగేశ్వర రావు, ఇంటూరి రాజేష్ అనే ఇద్దరు నేతలు పోటీ పడ్డారు. ఇంచార్జ్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేయగా చివరకు ఇంటూరి నాగేశ్వరరావుకు అవకాశం ఇచ్చింది అధిష్టానం. ఇప్పుడు పోటీ మళ్లీ మొదలైంది. కోటపాటి జనార్దన్ అనే సీనియర్ నాయకుడు కందుకూరు అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇంచార్జ్ పదవి విషయంలో ఇంటూరి రాజేష్, నాగేశ్వరరావు మధ్య ఉన్న విభేదాలు పార్టీ గెలుపుపై ప్రభావం చూపుతాయన్న ఆందోళనను వ్యక్తం చేస్తోంది పార్ల కేడర్.

ఇక ఈ ఇద్దరి పోరు ఇలా ఉండగా కోటపాటి జనార్దన్ పోటీ పడడం ఎక్కడికి దారి తీస్తుందోనని అనుకుంటుండగా, ఇప్పుడు మరో నాయకుడు లైన్ లోకి వచ్చారు. అతనే మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు. నేను యాక్టివ్ అయ్యాను టికెట్టు నాకే ఇవ్వాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన నాకు కాకుండా ఇతరులకు ఇచ్చి నాకు అన్యాయం చేయొద్దని అధిష్టానం వద్ద రిక్వెస్ట్ పెట్టారట. దీంతో ఇందరి పోరు చివరకు ఏం జరుగితుందోనని క్యాడర్ టెన్షన్ పడుతుందట. వైసీపీలో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డి పేరు ఖరారుగా పార్టీ చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని తెలుదేశం పార్టీ కేడర్ అధిష్టానాన్ని కోరుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…