Telangana Elections 2023: మీ ఓటును వేరే వాళ్లు వేశారా? కంగారొద్దు.. ఇలా చేయండి!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఎన్నికలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రజలంతా ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంత ఊర్లకు చేరుకుంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో తమ ఓటును వేరొకరు గప్‌చుప్‌గా వేస్తుంటారు. అలాగే ఒకసారికి మించి పలుమార్లు దొంగ ఓట్లు వేసేవారు కూడా ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో అసలు ఓటరు పోలింగ్ బూత్‌కు వెళ్లి తన ఓటు కోల్పోయానని తెలిసి ఆవేదన చెందుతుంటారు. తన ఓటు తిరిగి ఎలా పొందాలో..
హైదరాబాద్, నవంబర్ 30: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఎన్నికలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రజలంతా ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంత ఊర్లకు చేరుకుంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో తమ ఓటును వేరొకరు గప్‌చుప్‌గా వేస్తుంటారు. అలాగే ఒకసారికి మించి పలుమార్లు దొంగ ఓట్లు వేసేవారు కూడా ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో అసలు ఓటరు పోలింగ్ బూత్‌కు వెళ్లి తన ఓటు కోల్పోయానని తెలిసి ఆవేదన చెందుతుంటారు. తన ఓటు తిరిగి ఎలా పొందాలో తెలియక సతమతం అవుతుంటారు.
అలాంటి వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదంటోంది ఎన్నికల కమిషన్. మీ ఓటు మరొకరు వేసినా, మీ ఓటు హక్కును తిరిగి వినియోగించుకోవచ్చని చెబుతోంది. అందుకు అనుగుణంగా భారత ఎన్నికల సంఘం (ఈసీ) 1961లో సెక్షన్ 49(పి)ను అమల్లోకి తెచ్చింది. పోలింగ్ రోజున మీ ఓటును వేరే వారు వేశారని తెలిస్తే, సెక్షన్ 49(పి) ద్వారా మీ ఓటును పొందొచ్చన్నమాట. ఎవరైనా తమ ఓటు వేరొకరు వేశారని గుర్తిస్తే.. వెంటనే ముందుగా ప్రిసైడింగ్ అధికారి వద్దకు వెళ్లాలి. ఓటు కోల్పోయిన వ్యక్తి తానే అని ప్రిసైడింగ్ ముందు తగిన ఆధారాలతో నిరూపించుకోవాలి. ఇందుకు ఓటరు గుర్తింపు కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డులను చూపవల్సి ఉంటుంది. ఓటరు నిర్ధారణ జరిగిన తర్వాత ప్రిసైడింగ్ అధికారి ఇచ్చే ఫామ్ 17(బి)లో పేరు, సంతకం చేసి అందివ్వాలి.
అనంతరం టెండర్ బ్యాలెట్ పేపర్‌ను ఓటు కోల్పోయిన వ్యక్తికి ప్రిసైడింగ్ అధికారి ఇస్తారు. బ్యాలెట్ పేపర్‌పై నచ్చిన అభ్యర్థికి ఓటేసి.. మరలా దానిని ప్రిసైడింగ్ అధికారికి ఇవ్వాలి. ఆయన ఆ బ్యాలెట్ పేపర్‌ను ప్రత్యేక కవర్‌లో భద్రపరిచి, కౌంటింగ్ కేంద్రానికి జాగ్రత్తగా పంపిస్తారు. ఇలా చేస్తే మీరు మీ ఓటు హక్కు వినియోగించుకున్నట్లే అవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే సెక్షన్ 49(పి) ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే వారు తాము వేసే ఓటును ఈవీఎం ద్వారా వేసేందుకు అధికారులు అనుమతివ్వరు. ఇలా 49(పి) సెక్షన్ ద్వారా పొందే ఓటు హక్కును టెండర్ ఓటు లేదా ఛాలెంజ్ ఓటు అని అంటారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
తెలంగాణ పోలింగ్ కవరేజ్ కోసం..
తెలంగాణ పోలింగ్ లైవ్ వీడియో కోసం కింద క్లిక్ చేయండి..