Telangana Elections: ‘మేం ఓటేశాం.. మరి మీరు’.. ఓటింగ్ బాధ్యతను పూర్తి చేసిన క్రీడా ప్రముఖులు
గురువారం (నవంబర్ 30) ఉదయం నుంచే సామాన్యులతో పాటు పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూకట్టారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నా ఎంతో ఓపికతో క్యూ లైన్‌లో నిలబడి మరీ తమ ఓటు బాధ్యతను పూర్తి చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. మొత్తం 119 నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. గురువారం (నవంబర్ 30) ఉదయం నుంచే సామాన్యులతో పాటు పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూకట్టారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నా ఎంతో ఓపికతో క్యూ లైన్‌లో నిలబడి మరీ తమ ఓటు బాధ్యతను పూర్తి చేశారు. టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి అజారుద్దీన్, అతని కుమారుడు అసదుద్దీన్ తదితర కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఓటేసిన అనంతరం మహ్మద్ అజారుద్ధీన్ ట్వీట్ కూడా చేశారు. ‘ఈ ఎన్నికల్లో మార్పు రావాలని ప్రజలు ఓటు వేస్తున్నారు. తెలంగాణ పౌరులందరూ ఈరోజు భారీ సంఖ్యలో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ అభివృద్ధి, పురోగతి కోసం మీ ఓటు వేయండి’ అని ట్విట్టర్ వేదికగా ఓటర్లను కోరారు.
ఇక టీమిండియా మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా, ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్ తెలంగాణ ఓటింగ్‌లో పాల్గొన్నారు. అనంతరం తమ వేలిపై నున్న సిరా చుక్కను చూపిస్తూ ‘ మేము మా ప్రాథమిక బాధ్యతను వినియోగించుకున్నాం. ఇప్పుడే ఓటింగ్ బాధ్యతను పూర్తి చేశాం. మరి మీరు’ అని ట్వీట్ చేశారు.
కుటుంబ సభ్యులతో అజారుద్దీన్..
Voted for change. I urge all citizens of Telangana to vote in huge numbers today.
Cast your vote for development, growth, and progress. #TelanganaAssemblyElections #Telangana #TelanganaElection2023 pic.twitter.com/1IcR1eUML3
— Mohammed Azharuddin (@azharflicks) November 30, 2023
బాధ్యతను పూర్తి చేశా: ఓజా
View this post on Instagram
పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
తెలంగాణ పోలింగ్ కవరేజ్ కోసం..
పోలింగ్ లైవ్ వీడియో కోసం కింద క్లిక్ చేయండి..
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..