Barrelakka: ఓటు వేసిన బర్రెలక్క.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పిలుపు..
కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క (శిరీష) తన ఓటు హక్కును వినియోగించుకుంది. పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామంలో ఓటు వేశారు. హైకోర్టు ఆదేశాలతో ఆమె బందోబస్తు మధ్య పోలింగడ్ కేంద్రానికి వచ్చిన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అయితే ఆమెకు అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తోంది. సోషల్ మీడియాలో ఆమెకు భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది.
కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క (శిరీష) తన ఓటు హక్కును వినియోగించుకుంది. పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామంలో ఓటు వేశారు. హైకోర్టు ఆదేశాలతో ఆమె బందోబస్తు మధ్య పోలింగడ్ కేంద్రానికి వచ్చిన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అయితే ఆమెకు అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తోంది. సోషల్ మీడియాలో ఆమెకు భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. అయితే ఆమె పోటీ చేయడానికి ముందు అఫిడవిట్‌లో ఏం రాసిందో చాలా మంది తెలుసుకునేందుకు సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు. బర్రెలక్క నామినేషన్ డాక్యుమెంట్ ఇప్పటివరకు 61వేల మంది డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
డిగ్రీ చదివినా ఉద్యోగం రాకపోవడంతో బర్రెలు(గేదెలు) కాసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకుని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి వ్యూస్, కేస్ రెండూ తెచ్చుకున్న యువతి ‘బర్రెలక్క’. ఈ వీడియో యూట్యూబ్‌లో వైరల్ కావడంతో కర్నె శిరీష అనే ఆమె అసలు పేరు స్థానంలో బర్రెలక్కగా మారిపోయింది.
ఆమె బర్రెల వీడియో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందంటూ పోలీసులు అప్పట్లో కేసును సైతం నమోదు చేశారు. ప్రభుత్వం, అధికార పార్టీయే తనపై కేసు పెట్టించిందంటూ, ఆ కేసు కారణంగా తాను ఎన్నో కష్టాలు పడ్డానని బర్రెలక్క కన్నీరు పెట్టుకుంది. ఇంతకాలం పరీక్షలకు ప్రిపేరవుతూ, యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ సాగిపోయిన ఆమె హఠాత్తుగా ఎన్నికల బరిలో దిగడంతో అందరి దృష్టీ ఆమెపై పడింది. ప్రస్తుత ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన బర్రెలక్కకు మంచి స్పందన వస్తోంది.
బర్రెలక్క అఫిడవిట్‌లో ఏం రాసిందోనని ఎంతో మంది సెర్చ్ చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్, కోమటిరెడ్డి బ్రదర్స్, భట్టి విక్రమార్క, రాజాసింగ్, అజహరుద్దీన్ ఇలా ప్రముఖుల అఫిడవిట్ డౌన్‌లోడ్ల సంఖ్య కంటే బర్రెలక్క అఫిడవిట్ డౌన్‌లోడ్ల సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. బరిలో నిలిచిన బర్రెలక్క అఫిడవిట్‌లో ఏం రాసిందోనని గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. అప్పట్లో బర్రెలక్క నిరుద్యోగాన్ని హైలైట్ చేస్తూ వ్యంగ్యంగా ఆమె చేసిన వీడియోకు ఆదరణ రావడంతో ఆమెపై కేసు పెట్టారు. ఆ కేసు పెట్టడంలో ప్రభుత్వ తీరును అనేకమంది యువత, నిరుద్యోగులు తప్పుబట్టారు. ఇప్పుడు బర్రెలక్క ఎన్నికలలో పోటీ చేస్తుండడంతో ఆమెకు చాలా మంది మద్దతుగా నిలుస్తున్నారు.
పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
తెలంగాణ పోలింగ్ కవరేజ్ కోసం..