Telangana Elections: తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ నాయకులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈరోజు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ లైన్లలో నిలుచున్నారు. ఇప్పటికే మంచిర్యాలలో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వేంకట స్వామి తన ఓటు వేశారు.

Telangana Elections: తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ నాయకులు
Ts Elections
Follow us
Srikar T

| Edited By: Ravi Kiran

Updated on: Nov 30, 2023 | 9:42 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈరోజు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ లైన్లలో నిలుచున్నారు. ఇప్పటికే మంచిర్యాలలో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వేంకట స్వామి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. బంజారా హిల్స్‌లోని నందినగర్ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత ఓటు వేశారు. అలాగే పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ సతీసమేతంగా నారాయణపురంలోని పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. బొప్పాపూర్‌లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు ఓటు వేశారు. సూర్యాపేట బూత్ నంబర్ 5లో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి జగదీష్ రెడ్డి. వనపర్తిలో ఓటు వేసిన మంత్రి నిరంజన్ రెడ్డి.

ఖమ్మంలో తుమ్మల నాగేశ్వర్ రావు కూడా ఉదయాన్నే సతీసమేతంగా పోలింగ్ బూత్‌కి చేరుకొని ఓటు వేశారు. కరీంనగర్‌లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వినోద్ కుమార్ ఓటు వేయగా.. పర్వతగిరిలోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్న తెలంగాణ మంత్రి యర్రబల్లి దయాకర్ రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. డోర్నకల్ బీఆర్ఎస్ అభ్యర్థి రెడ్యానాయక్ కూడా ఓటు వేసేందుకు ఉత్సాహం చూపించారు. అంబర్ పేట పరిధిలోని బర్కత్‌పురలో తన ఓటు హక్కును వినియోగించుకున్న కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి దంపతులు ఓటు వేశారు. శేరి లింగంపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి అరికపూడి గాంధీ. బోయిన్ పల్లిలో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి దంపతులు ఓటు వేశారు. ఖమ్మంలో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్, నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొల్లాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి క్రిష్ణా రావు తనకు కేటాయించిన పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేశారు. ఇలా  పార్టీలకు అతీతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు ప్రముఖ రాజకీయ నాయకులు.

పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

తెలంగాణ పోలింగ్ కవరేజ్ కోసం..

పోలింగ్ లైవ్ వీడియో కోసం కింద క్లిక్ చేయండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..