Telangana: కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం.. ఆ బీజేపీ అభ్యర్థికి Y+ సెక్యూరిటీ
బీజేపీ తరపున హైదరాబాద్ అభ్యర్థిగా.. అనూహ్యంగా సీటు దక్కించుకున్నారు మాధవీలత. హైదరాబాద్ అనేది ఎంత సెన్సిటీవ్ నియోజకవర్గమో అందరికీ తెలిసిన విషయమే. అందుకే అక్కడి నుంచి పోటీ చేస్తున్న కొంపెల్ల మాధవీలతకు హై సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది.

బీజేపీ తరపున హైదరాబాద్ అభ్యర్థిగా.. అనూహ్యంగా సీటు దక్కించుకున్నారు మాధవీలత. హైదరాబాద్ అనేది ఎంత సెన్సిటీవ్ నియోజకవర్గమో అందరికీ తెలిసిన విషయమే. అందుకే అక్కడి నుంచి పోటీ చేస్తున్న కొంపెల్ల మాధవీలతకు హై సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఆమెకు Y+ సెక్యూరిటీ కల్పిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. హైదరాబాద్‌లో MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీపై మాధవీలత పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. VIP సెక్యూరిటీలో భాగంగా మాధవీలతకు 11 మంది పోలీసు సిబ్బంది సెక్యూరిటీగా ఉంటారు. ఆరుగురు CRPF పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఆమెకు ఎల్లప్పుడూ భద్రతగా ఉంటారు. మరో ఐదుగురు సాయుధులైన గార్డులు మాధవీలత ఇంటి వద్ద సెక్యూరిటీగా ఉండనున్నారు. పొలిటికల్ లీడర్స్, వ్యాపారవేత్తల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం Y+ సెక్యూరిటీ కల్పిస్తోన్న సంగతి తెలిసిందే.
మాధవీ లత ప్రముఖ విరించి ఆస్పత్రి చైర్ పర్సన్‌గా ఉన్నారు. ఈమె గత కొంతకాలంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ యాకుత్‌పురాలో గల సంతోశ్‌నగర్‌లో పుట్టి పెరిగిన మాధవీలత.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువులు చదివారు. ఆర్టిస్ట్, ఫిలాసఫర్, భరతనాట్య నృత్యకారిణి, ఎంటప్రిన్యూర్ అయిన మాధవీలత.. విరించి గ్రూఫ్ ఫౌండర్ కొంపెల్ల విశ్వనాథ్‌ను 2001లో మ్యారేజ్ చేసుకున్నారు. ఈమె లతామా ఫౌండేషన్ ఛైర్‌పర్సన్‌గా కూడా పనిచేస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా పాతబస్తీ వేదికగా గోశాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి.. హిందూ ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాగా, పాతబస్తీలో ఇప్పటివరకు ఓటమి చూడని అసదుద్దీన్ ఓవైసీపై ఆమె పోటీ చేస్తున్నారు. ఈసారి ఆయన్ను ఓడించి తీరుతానని మాధవీలత గట్టిగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సున్నితమైన పాతబస్తీలో ఆమె ప్రచారం, పర్యటనలు ఉండటంతో.. కేంద్రం Y+ సెక్యూరిటీ కల్పించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…








