Mahabubnagar Politics: ఇంతకీ వారెక్కడ..? అసెంబ్లీ ఎన్నికల తర్వాత కనిపించని నేతలు..

ఆ సీనియర్ నేతల అంచనాలు తలక్రిందులు అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల మందు నాటి అధికార పార్టీలో చేరితే అనంతరం మళ్లీ ప్రతిపక్షంలోకి వెళ్లారు. అయితే అప్పటి నుంచి చడిచప్పుడు లేకుండా ఉండిపోయారు. పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న వేళ ఆ నేతల ప్రయాణం ఎటు వైపో ఇంకా తెలియడం లేదు.

Mahabubnagar Politics: ఇంతకీ వారెక్కడ..? అసెంబ్లీ ఎన్నికల తర్వాత కనిపించని నేతలు..
Brs Leaders
Follow us
Boorugu Shiva Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Apr 06, 2024 | 11:31 AM

ఆ సీనియర్ నేతల అంచనాలు తలక్రిందులు అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల మందు నాటి అధికార పార్టీలో చేరితే అనంతరం మళ్లీ ప్రతిపక్షంలోకి వెళ్లారు. అయితే అప్పటి నుంచి చడిచప్పుడు లేకుండా ఉండిపోయారు. పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న వేళ ఆ నేతల ప్రయాణం ఎటు వైపో ఇంకా తెలియడం లేదు. ఎవరికి వారు సైలెంట్ అయిపోయారు. ఎమ్మెల్యే టికెట్ కోసం నాడు తీవ్ర ప్రయత్నాలు చేసిన నేతలు పార్లమెంట్ ఎన్నికల వేళనైన బయటకు వస్తారా లేదా అని క్యాడర్‌లో చర్చలు నడుస్తున్నాయట.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయాలు ఎవరి అంచనాలకు అందవు. నాడు అసెంబ్లీ ఎన్నికల ముందు వివిధ కారణాలతో కాంగ్రెస్, బీజేపీని వదిలి అధికార బీఆర్ఎస్ లో చేరారు కొంత మంది ముఖ్య నేతలు. తీరా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పు షాక్ ఇవ్వడంతో ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితిలో ఉండిపోయారు. అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రతిపక్ష కాంగ్రెస్ లో పనిచేసి.. ఎన్నికల ముందు మరోసారి అధికారంలోకి వస్తుందనుకుని బీఆర్ఎస్‌లో చేరితే లెక్కలు తారుమారయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు నాటి వరకు పదేళ్లు ప్రతిపక్షానికి పరిమితమై, ఇప్పుడు మళ్లీ ప్రతిపక్షంలోనే చేరిపోయారు.

అసెంబ్లీ ఎన్నికల ముందు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కీలక నేతల అంచనాలు తప్పయ్యాయి. రాజకీయ కురువృద్ధుడు నాగం జనార్థన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, టీడీపీ సినీయర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, మరికొంతమంది నేతలు ఆయా పార్టీలను వీడి కారెక్కారు. ఆయా పార్టీల్లో అసంతృప్తిని అసరా చేసుకుని వీరందరిని నాడు బీఆర్ఎస్ పార్టీ చేర్చుకుంది. ఎంతో కొంత ఓటు బ్యాంకు పార్టీ అభ్యర్థులకు కలసివస్తుందని భావించి, అధికారంలోకి వచ్చాక తగిన అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఎన్నికల ముందు వరకు పరిస్థితి బాగానే ఉన్న ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఓటమితో నేతలు అవాక్యయ్యారు. ఇక చేసిదీ లేక అలానే పార్టీలో ఉండిపోయారు.

అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఒక్క రావుల చంద్రశేఖర్ రెడ్డి మినహా మిగిలిన నాగం జనార్థన్ రెడ్డి, ఎర్ర శేఖర్, పీ చంద్రశేఖర్ వంటి నేతలు అడ్రస్ లేకుండా పోయారట. నాడు ఎన్నికల ప్రచారంలో కాస్త హడవిడి చేసిప్పటికీ ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు, క్యాడర్‌తో పెద్దగా టచ్‌లో లేరట. అయితే ఇతర పార్టీలోకి వెళ్లే ఆలోచన సైతం చేయడం లేదట. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను పరిశీలిస్తూ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని వారి అనుచరులు చెబుతున్నారు.

ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వీరంతా ఎక్కడా అనే ప్రశ్న గులాబీ క్యాడర్‌ను తొలుస్తోందట. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పత్తా లేకుండా పోయిన నేతలు మళ్లీ ఎందుకు నేతలు, కార్యకర్తల మధ్యకు రావడం లేదని అంతర్గతంగా చర్చించుకుంటున్నారట. ఎంపీ ఎన్నికల్లో అసలు వీరు కనపిస్తారా లేక రాజకీయాలకు దూరంగా ఉంటారా అని గులాబీ శ్రేణుల్లో గందరగోళం నెలకొందట..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…