Hyderabad: ఫ్యాషన్ డిజైనింగ్ వైపే యువత.. ముంబై నగరంతో పోటీపడుతోన్న నగరం..

ట్రెండ్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. కొందరు ఫ్యాషన్ ని ఫాలో అయితే ... మరి కొందరు ట్రెండ్ ను సెట్ చేస్తారు. ముఖ్యంగా తాము వేసుకునే బట్టల పై ప్రతి ఒక్కరు చాలా ఆసక్తి చూపిస్తుంటారు. నలుగురిలో తాము ధరించే దుస్తువులు అదిరేలా ఉండాలని కోరుకుంటారు. దీంతో ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ డిజైనింగ్ కి మంచి డిమాండ్ ఏర్పడింది. పైగా ఫ్యాషన్ కి వేదిక అయిన ముంబాయి నగరంతో సైతం నగరం పోటీపడుతుంది.

Hyderabad: ఫ్యాషన్ డిజైనింగ్ వైపే యువత.. ముంబై నగరంతో పోటీపడుతోన్న నగరం..
Fashion Industry In Hyderabad
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Surya Kala

Updated on: Apr 06, 2024 | 12:20 PM

క్రియేటివ్ ఫిల్డ్ వైపు అడుగులు వేస్తుంది యువత. క్రియేటివిటితో ఫ్యాషన్ డిజైనింగ్ లోకి రావలనుకునే వారి సంఖ్య పెరుగుతుంది. పైగా మార్కెంట్ లో ట్రెండింగ్ లో ఉన్నారంగం ఫ్యాషన్ డిజైనింగ్. దీంతో చాలా మంది మహిళలు బెస్టు అఫ్షన్ గా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులను ఎంపిక చేసుకుంటున్నారు. త్వరగా సెటిల్ అవ్వలని, కెరిర్ లోతాము బెస్టు అనిపించుకోవాడానికి బెస్టు ఆప్షన్ గా ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో నగరంలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులకు డిమాండ్ పెరిగింది.

ట్రెండ్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. కొందరు ఫ్యాషన్ ని ఫాలో అయితే … మరి కొందరు ట్రెండ్ ను సెట్ చేస్తారు. ముఖ్యంగా తాము వేసుకునే బట్టల పై ప్రతి ఒక్కరు చాలా ఆసక్తి చూపిస్తుంటారు. నలుగురిలో తాము ధరించే దుస్తువులు అదిరేలా ఉండాలని కోరుకుంటారు. దీంతో ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ డిజైనింగ్ కి మంచి డిమాండ్ ఏర్పడింది. పైగా ఫ్యాషన్ కి వేదిక అయిన ముంబై నగరంతో సైతం నగరం పోటీపడుతుంది. నగరంలో ఫ్యాషన్ ట్రెండ్, ఫ్యాషన్ డిజైనింగ్ ఊపందుకుంది.

క్రియేటివ్ ఫిల్డ్ వైపు అడుగులు వేస్తుంది యువత. డాక్టర్ ఓ, ఇంజనీరో కావలనుకునే పాత ట్రెండ్ ను మార్చెస్తున్నారు టీనేజర్స్ .. కోత్త అవకాశాలను వెతుకుంటున్నారు. రోజురోజుకి క్రెజ్ సంపాదించుకుంటున్న ఫ్యాఫన్ డిజైనింగ్ వైపు అడుగుల వేస్తున్నారు. దీంతో హైదరాబాద్ ఫ్యాషన్ హబ్ గా మారుతుంది. పైగా ఫ్యాఫన్ డిజైనింగ్ కోర్సుల తో ఫ్యుచర్ బాగుంటుందంటున్నారు స్టుడెంట్స్.. మిగితా కోర్సులతో పోలిస్తే ఒత్తిడి తక్కువగా ఉంటుందని, ఇష్టంతో వస్తే ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్లవచ్చని, లైఫ్ లో త్వరగా సెటిల్ అవ్వవచ్చు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

పది మందిలో ప్రత్యేక గుర్తింపు ఉండాలంటే ఫ్యాషన్ డిజైనింగ్ బెస్టు అంటున్నారు స్టుడెంట్స్. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి తక్కువ ఖర్చులో అయిపోయే రంగం కుడా ఇదే అంటున్నారు. పైగా మార్కెట్ లో ఫ్యాషన్ డిజైనింగ్ కి మంచి డిమాండ్ ఉందన్నారు. చిన్నప్పటినుండి తమకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టమని హిటమ్స్ అకాడమిలో లో తమకు అందుబాటు ధరలో అర్ధం అయ్యేలా చెడుతున్నారన్నారు వారు.. ఫైగా ప్రాజెక్ట్ వర్క్స్, సెమినార్స్ కండక్ట్ చెయడంతో పాటు , అర్దం అయేలా ఇండస్ట్రియల్ టుర్స్ తీసుకుని వెళ్తారని తెలిపారు.

ఇంతకు ముందు సిటి యుత్ మాత్రామే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల పై ఆసక్తి చూపించేవారు. ఇప్పుడు గ్రామల నుంచి వచ్చిన యువత కుడా ఈ రంగంలో అడుగు పెడుతుంది. క్రియేటివ్ అలోచనలతో సరికోత్త డిజైన్ లతో ఫ్యాషన్ పై తమదైన ముద్ర వేస్తుంది.

మరిని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..