Earthquake: భూమి లోపల ఏం జరుగుతుంది.. కాలిఫోర్నియా నుంచి కాశ్మీర్ వరకు 12 గంటల్లో అనేక ప్రదేశాల్లో భూకంపాలు

రాజస్థాన్‌లో కూడా భూకంపం సంభవించింది. ఇక్కడ పాలిలో మధ్యాహ్నం 1.29 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 3.7గా నమోదు అయిందని తెలిపారు. అర్థరాత్రి ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు నిద్ర కోల్పోయారు. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. అయితే ఇక్కడ కూడా ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు. అంతేకాదు గురువారం రాత్రి హిమాచల్‌లో కూడా భూకంపం సంభవించింది.

Earthquake: భూమి లోపల ఏం జరుగుతుంది.. కాలిఫోర్నియా నుంచి కాశ్మీర్ వరకు 12 గంటల్లో అనేక ప్రదేశాల్లో భూకంపాలు
Earthquake News
Follow us
Surya Kala

|

Updated on: Apr 06, 2024 | 11:20 AM

ప్రపంచంలోని అనేక దేశాల్లో భూకంప ప్రకంపనలు ఒకదాని తర్వాత ఒకటిగా సంభవించాయి. నిత్యం భూ ప్రకంపనలతో ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. గత గురు, శుక్రవారాల్లో భారత్‌లో పలుచోట్ల భూకంపం సంభవించింది. శుక్రవారం ఏప్రిల్ 5వ తేదీన జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.2గా నమోదైనట్లు జాతీయ భూకంప కేంద్రం తెలిపింది. రాత్రి 11 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించినట్లు సమాచారం. అర్థరాత్రి సంభవించిన భూకంపంతో కిష్త్వార్‌లో కలకలం రేగింది. రాత్రికి రాత్రే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.

దీంతో పాటు రాజస్థాన్‌లో కూడా భూకంపం సంభవించింది. ఇక్కడ పాలిలో మధ్యాహ్నం 1.29 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 3.7గా నమోదు అయిందని తెలిపారు. అర్థరాత్రి ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు నిద్ర కోల్పోయారు. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. అయితే ఇక్కడ కూడా ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు. అంతేకాదు గురువారం రాత్రి హిమాచల్‌లో కూడా భూకంపం సంభవించింది.

న్యూయార్క్, న్యూజెర్సీలలో భూకంపం ప్రకంపనలు

న్యూయార్క్ నగరం , ఉత్తర న్యూజెర్సీ చుట్టూ భూకంప ప్రకంపనలు సంభవించాయి. సమాచారం ప్రకారం  న్యూజెర్సీలో భూకంప తీవ్రత 4.0. ఇక్కడ పలు ప్రాంతాల్లో భూకంపం కారణంగా భూమి కంపించింది. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. అయితే ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

ఇవి కూడా చదవండి

ఉత్తర కాలిఫోర్నియాలో భూకంపం

ఉత్తర కాలిఫోర్నియాలో కూడా భూకంపం సంభవించింది. ఇక్కడ 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. విశేషమేమిటంటే.. ఈ భూకంపం ఒకటి రెండు సార్లు కాదు.. వేర్వేరు సమయాల్లో 7 సార్లు భూకంపాలు సంభవించాయి. ఒకదాని తర్వాత ఒకటిగా భూకంపాలు వస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. అయితే ఇక్కడ కూడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. శుక్రవారం కూడా మయన్మార్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా నమోదైంది.

తైవాన్‌లో భూకంపం విధ్వంసం

కొద్ది రోజుల క్రితం తైవాన్‌లో భారీ భూకంపం వచ్చింది. ఇందులో చాలా మంది చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గత 25 ఏళ్లలో తైవాన్‌లో ఇంత ప్రమాదకరమైన భూకంపం సంభవించిందని రికార్డ్ లు చెబుతున్నాయి. చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చాలా మంది సమాధి అయ్యే అవకాశం ఉంది. వాటిని తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్‌లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..