AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Somvati Amavasya: సోమవారం ఈ పరిహారాలు చేసి చూడండి.. పితృ దోషం తొలగి అన్ని అడ్డంకులు తొలగిపోతాయి..

పంచాంగం ప్రకారం ఈసారి అమావాస్య 8 ఏప్రిల్ 2024 సోమవారం వచ్చింది. సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య అని అంటారు. అన్ని అమావాస్యల్లో సోమవతి అమావాస్య చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. సోమవతి అమావాస్య రోజున స్నానం, దానంతో పాటు పితృపూజ కూడా చేస్తారు, అందుకే ఈ రోజున కొన్ని చర్యలు చేస్తే పితృదోషం నుండి ఉపశమనం లభిస్తుంది. పూర్వీకుల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. సోమవతి అమావాస్య రోజున పిత్రా దోషం నుంచి బయటపడటానికి కొన్ని ప్రభావవంతమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

Somvati Amavasya: సోమవారం ఈ పరిహారాలు చేసి చూడండి.. పితృ దోషం తొలగి అన్ని అడ్డంకులు తొలగిపోతాయి..
Somvati Amavasya 2024
Surya Kala
|

Updated on: Apr 06, 2024 | 9:29 AM

Share

హిందూ మతంలో అమావాస్య చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. వేద క్యాలెండర్ ప్రకారం ప్రతి హిందూ నెలలో చివరి రోజును అమావాస్య అంటారు. ఈ రోజున చేసే ఉపవాసం, పూజలు, స్నానం, దానధర్మాలు మొదలైన వాటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పంచాంగం ప్రకారం ఈసారి అమావాస్య 8 ఏప్రిల్ 2024 సోమవారం వచ్చింది. సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య అని అంటారు.

అన్ని అమావాస్యల్లో సోమవతి అమావాస్య చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. సోమవతి అమావాస్య రోజున స్నానం, దానంతో పాటు పితృపూజ కూడా చేస్తారు, అందుకే ఈ రోజున కొన్ని చర్యలు చేస్తే పితృదోషం నుండి ఉపశమనం లభిస్తుంది. పూర్వీకుల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. సోమవతి అమావాస్య రోజున పిత్రా దోషం నుంచి బయటపడటానికి కొన్ని ప్రభావవంతమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

పిత్ర దోషాన్ని తొలగించే మార్గాలు

సోమవతి అమావాస్య రోజున నల్ల నువ్వులను దానం చేయడం చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ రోజున నల్ల నువ్వులను దానం చేయాలి. ఇలా చేయడం వలన పితృ దోషాలు తొలగిపోతాయని, పూర్వీకులు సంతుష్టులవుతారని.. తమ కుటుంబ సభ్యులపై ఆశీస్సులను అందజేస్తారని నమ్మకం. పూర్వీకులను ప్రసన్నం చేసుకుంటే జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోయి జీవితంలోని ప్రతి పనిలో పురోగతి సాధిస్తారని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

సోమవతి అమావాస్య రోజున స్నానం, దానం చేయడానికి అనుకూలమైన సమయం

  1. మత విశ్వాసాల ప్రకారం సోమవతి అమావాస్య రోజున రావి చెట్టు క్రింద 11 దేశీ నెయ్యి దీపాలను వెలిగించి..  పూర్వీకులను నిర్మలమైన హృదయంతో పూజించండి. ఇలా చేయడం వలన పూర్వీకులు సంతోషిస్తారు.
  2. సోమవతి అమావాస్య రోజున పాలు, అన్నం దానం చేయడం కూడా చాలా ముఖ్యమైనది. అందుకే నల్ల నువ్వులతో పాటు పాలు , అన్నం కూడా దానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని.. ఏదైనా కారణాల వల్ల పూర్వీకులు కోపంతో ఉంటే ఆ కోపం కూడా తొలగిపోతుందని నమ్ముతారు.
  3. సోమవతి అమావాస్య రోజున పరమశివుడిని, పార్వతిని పూజించే సంప్రదాయం ఉంది. అందుకే సోమవతి అమావాస్య నాడు శివ పార్వతిని తప్పక పూజించాలి.ఇలా చేయడం వలన శివపార్వతుల ఆశీస్సులు లభిస్తాయి. సోమవతి అమావాస్య రోజున గంధం, శంఖం, కొబ్బరికాయ, బిల్వ పత్రం వంటి వాటిని  సమర్పించండి.
  4. హిందూ మతంలో పిండ ప్రదానం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఏవైనా కారణాల వల్ల మీరు మీ పూర్వీకుల పిండ ప్రదానం చేయలేకపోతే సోమవతి అమావాస్య రోజున పూర్వీకుల కోసం పిండ ప్రదానం  చేయాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతృప్తి చెందుతారని నమ్మకం.
  5. సోమవతి అమావాస్య రోజున ముఖ్యంగా కాకి, కుక్క, ఆవు, గేదె మొదలైన ఏ ప్రాణికి హాని చేయకూడదు. అమావాస్య రోజున జంతువులకు పక్షులకు ఆహారం, ధాన్యం, నీరు ఏర్పాట్లు చేయాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతుష్టులవుతారు. తమ కుటుంబీకులను అనుగ్రహిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Follow Us
నెయ్యి ప్యాకెట్ కొనేముందు చాలామంది చేసే పొరపాటు ఇదే..
నెయ్యి ప్యాకెట్ కొనేముందు చాలామంది చేసే పొరపాటు ఇదే..
శ్రీనిధిని ఆటపట్టించిన త్రివిక్రమ్.. కాళ్లమొక్కబోయిన డైరెక్టర్..
శ్రీనిధిని ఆటపట్టించిన త్రివిక్రమ్.. కాళ్లమొక్కబోయిన డైరెక్టర్..
ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన
ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన
రాగి ముద్ద తింటే నిజంగా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?  
రాగి ముద్ద తింటే నిజంగా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?  
అభిషేక్ శర్మ ఈ సీక్రెట్ ఫాలో చేస్తే మీరూ ఓ కాటేరమ్మ కొడుకే..!
అభిషేక్ శర్మ ఈ సీక్రెట్ ఫాలో చేస్తే మీరూ ఓ కాటేరమ్మ కొడుకే..!
భారత్‌లో ముందుగానే రిలీజ్ కానున్న 'అవెంజర్స్: డూమ్స్‌డే’
భారత్‌లో ముందుగానే రిలీజ్ కానున్న 'అవెంజర్స్: డూమ్స్‌డే’
ఇంటి గోడలకు పగుళ్లు వస్తున్నాయా? ఏ పగులుకు ఏ మెటీరియల్‌ వాడాలి?
ఇంటి గోడలకు పగుళ్లు వస్తున్నాయా? ఏ పగులుకు ఏ మెటీరియల్‌ వాడాలి?
 లుంగీతో వచ్చి చీర కట్టుకున్న వ్యక్తులు.. టీవీ9 కెమెరాకు చిక్కిన
 లుంగీతో వచ్చి చీర కట్టుకున్న వ్యక్తులు.. టీవీ9 కెమెరాకు చిక్కిన
రజినీకాంత్ మెచ్చిన సినిమా.. అడియన్స్ హృదయాలను హత్తుకుంటున్న మూవీ.
రజినీకాంత్ మెచ్చిన సినిమా.. అడియన్స్ హృదయాలను హత్తుకుంటున్న మూవీ.
ధ్వజో యోగం.. దీపావళికి అనుకోకుండా కోటీశ్వరులయ్యే రాశులు వీరే!
ధ్వజో యోగం.. దీపావళికి అనుకోకుండా కోటీశ్వరులయ్యే రాశులు వీరే!