Annamayya Vardhanti: తిరుమలలో వైభవంగా అన్నమయ్య వర్ధంతి వేడుకలు

తాళ్ళ‌పాక ధ్యాన‌మందిరం వ‌ద్ద ఉద‌యం 8 నుండి 11 గంట‌ల వ‌ర‌కు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహించారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్యామ్‌కుమార్ బృందం సంగీత సభ, రాత్రి 8 నుండి 9.30 గంటల వ‌ర‌కు తిరుపతికి చెందిన ర‌మేష్ బాబు బృందం హరికథ గానం చేసారు. రాజంపేట-కడప హైవేలో ఉన్న 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, మ‌ణి బృందం అన్నమయ్య కీర్తనలను ఆలపించారు.

Annamayya Vardhanti: తిరుమలలో వైభవంగా అన్నమయ్య వర్ధంతి వేడుకలు
Annamayya Vardhanti
Follow us
Raju M P R

| Edited By: Surya Kala

Updated on: Apr 06, 2024 | 7:52 AM

శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమాచార్యుల 521వ వర్ధంతి మహోత్సవాలు టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. తిరుపతిలో అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ ఘనంగా ప్రారంభించింది. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన స‌ప్త‌గిరి సంకీర్తనల గోష్ఠిగానం ఆకట్టుకుంది. ఉదయం 9 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు, స్థానిక కళాకారులు క‌లిసి సప్తగిరి సంకీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు. బ్రహ్మకడిగిన పాదము శరణంటూ హరి అవతారమితుడు అన్నమయ్య శరణు శరణు కీర్తనలను కళాకారులు ఆలపించారు. అనంతరం హారతి, మహానివేదన చేపట్టగా సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు తిరుపతికి చెందిన ప‌ద్మ‌ప్రియ బృందం, రాత్రి 7 నుండి 8.30 గంట‌ల‌కు వ‌ర‌కు ఆర్తి బృందం గాత్ర సంగీత సభ నిర్వహించారు.

తాళ్ళ‌పాక ధ్యాన‌మందిరం వ‌ద్ద ఉద‌యం 8 నుండి 11 గంట‌ల వ‌ర‌కు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహించారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్యామ్‌కుమార్ బృందం సంగీత సభ, రాత్రి 8 నుండి 9.30 గంటల వ‌ర‌కు తిరుపతికి చెందిన ర‌మేష్ బాబు బృందం హరికథ గానం చేసారు. రాజంపేట-కడప హైవేలో ఉన్న 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, మ‌ణి బృందం అన్నమయ్య కీర్తనలను ఆలపించారు. రాత్రి 8 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తికి చెందిన వెంక‌ట కృష్ణ‌య్య బృందం హరికథ కార్యక్రమాలను ఢిల్లీ టిటిడి నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అన్న‌మాచార్య ప్రాజెక్టుసంచాల‌కులు డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..