Ugadi: శ్రీశైలంలో నేటి నుంచి ఉగాది మహోత్సవాలు ప్రారంభం.. అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు..

ఉగాది ఉత్సవాలలో భక్తుల రద్దీ దృష్ట్యా స్వామి వారి గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలను ఆలయ అధికారులు నేటి నుంచి నిలిపివేశారు. భక్తులకు 3 క్యూలైన్ల ద్వారా మాత్రమే స్వామి అమ్మవార్ల అలంకార దర్శనం కల్పించనున్నారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు తాగునీరు, అల్పాహారాన్ని నిరంతరం అందిస్తున్నారు. భక్తులకు అడిగినన్ని లడ్లు ఇచ్చేలా ఏర్పాటులు చేశారు. ముఖ్యంగా పాదయాత్ర ద్వారా వచ్చే భక్తులకు అటవీ మార్గంలో మంచినీటి సౌకర్యం, చలవ పందిళ్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.

Ugadi: శ్రీశైలంలో నేటి నుంచి ఉగాది మహోత్సవాలు ప్రారంభం.. అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు..
Srisailam Temple
Follow us

| Edited By: Surya Kala

Updated on: Apr 06, 2024 | 8:26 AM

ఉగాది మహోత్సవాలకు శ్రీశైలం మహా క్షేత్రం ముస్తాబయింది. తమ ఆడపడుచు శ్రీ భ్రమరాంబ అమ్మవారికి సారే సమర్పించేందుకు లక్షలాది మంది కన్నడ భక్తులు పాదయాత్రగా శ్రీశైల క్షేత్రానికి తరలి వస్తున్నారు. ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీశైలంలో ఐదు రోజులపాటు భ్రమరాంబ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉగాది మహోత్సవాలకు సుమారు పది లక్షల మంది భక్తులు శ్రీశైలం చేరుకునే అవకాశం ఉందని దేవస్థానం అధికారులు అంచనా వేశారు. అందుకు తగ్గట్లుగా భక్తులకు ఏర్పాటు చేశారు.

శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలకు విద్యుత్ దీపకాంతులతో ఆలయం ముస్తాబైంది. ఆలయ గోపురాలు విద్యుత్ కాంతులతో ఉగాది మహోత్సవాల శోభ సంతరించుకుంది. శ్రీశైలం మహాక్షేత్రంలో నేటి 6 నుంచి 10 వ తేదీ వరకు ఉగాది మహాత్సవాలు వైభవంగా నిర్వహించేందు దేవస్థానం అధికారులు ఈఓ పెద్దిరాజు సిబ్బంది భక్తుల ఏర్పాట్ల పనులలో నిమగ్నమయ్యారు. ఆలయం సర్వాంగసుందరంగా ముస్తాబయింది. ఆలయంలో నేటి ఉదయం యాగశాల ప్రవేశంతో ఉగాది మహోత్సవాలకు ఈఓ పెద్దిరాజు శ్రీకారం చుట్టనున్నారు. మొదటిరోజు అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో‌ భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రకి బృంగివాహనంపై స్వామిఅమ్మవార్లు శ్రీశైలం పురవీధులలో విహారించన్నారు. మహాక్షేత్రంలో 5 రోజులపాటు జరుగనున్న ఉగాది మహోత్సవాలకు కర్ణాటక రాష్ట్రం నుంచి కన్నడ భక్తులు తండోపతండాలుగా భక్తిశ్రద్ధలతో వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ శ్రీగిరి మల్లయ్య ఆదుకో మమ్మాదుకో అంటూ నల్లమల కొండలు దాటుతూ కోరిన కోరికలు తీర్చాలంటూ ఆర్తీతో భగభగ మండే ఎండను సైతం లెక్క చేయకుండా అకలి దప్పికలు మరచి భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న భక్తులకు దేవస్థానం అధికారులు స్వచ్చంద సేవకులు అడవి మార్గంలో ఎన్నడూ చేయని విధంగా ఏర్పాట్లు చేశారు. అక్కడక్కడా మంచినీళ్లు అల్పాహారం భోజన వసతి భక్తులకు ఏర్పాటు చేశారు. అలసిన భక్తులకు అనారోగ్యంతో బాధపడుతున్న భక్తుల కోసం ఉచితంగా మెడికల్ క్యాంపులు పెట్టి అధికారులు సేవకు భక్తుల సేవలో నిమగ్నమయ్యారు.

తండోపతండాలుగా తరలివస్తున్న కన్నడ భక్తులు

శ్రీ భ్రమరాంబ దేవిని కర్ణాటక రాష్ట్రం వాసులు ఆడపడుచుగా భావిస్తారు. ఉగాది ఉత్సవాల్లో భాగంగా కన్నడిగులు కర్ణాటక ప్రాంతం నుంచి కర్నూలు మీదుగా ఆత్మకూరు చేరుకొని వెంకటాపురం అటవీ ప్రాంతంలో నడుచుకుంటూ కొండలు కోనలు దాటుకొని శ్రీశైలానికి చేరుకుంటారు. ఈ ఏడాది భ్రమరాంబదేవి సన్నిధికి కన్నడ భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. కన్నడిగుల తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. శ్రీశైల మహా క్షేత్రంలో ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఉగాది ఉత్సవాలకు దాదాపు 10 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని దేవస్థానం అధికారులు అంచనా వేశారు. శ్రీశైలానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో శ్రీశైల క్షేత్ర వీధులన్నీ రద్దీగా మారాయి.

ఇవి కూడా చదవండి

అభిషేకాలు, స్పర్శ దర్శనాలు నిలిపివేత

ఉగాది ఉత్సవాలలో భక్తుల రద్దీ దృష్ట్యా స్వామి వారి గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలను ఆలయ అధికారులు నేటి నుంచి నిలిపివేశారు. భక్తులకు 3 క్యూలైన్ల ద్వారా మాత్రమే స్వామి అమ్మవార్ల అలంకార దర్శనం కల్పించనున్నారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు తాగునీరు, అల్పాహారాన్ని నిరంతరం అందిస్తున్నారు. భక్తులకు అడిగినన్ని లడ్లు ఇచ్చేలా ఏర్పాటులు చేశారు. ముఖ్యంగా పాదయాత్ర ద్వారా వచ్చే భక్తులకు అటవీ మార్గంలో మంచినీటి సౌకర్యం, చలవ పందిళ్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అలాగనే క్షేత్ర పరిధిలో ట్రాఫిక్ జామ్ నియంత్రణ, ఆలయ పరిధిలోని ఖాళీ ప్రదేశాలలో భక్తులు సేదదీరేందుకు చలువ పందిళ్ళు, తాగునీరు, విద్యుదీకరణ వాహన పార్కింగ్ పారిశుద్ధ్యం తదితర సదుపాయాలు కల్పించామని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.

ఉగాది మహోత్సవాలు నేటి మొదటి రోజు

శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు నేటి మొదటి రోజు కావడంతో భ్రమరాంబాదేవి అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. భృంగి వాహనంలో‌ శ్రీశైలం పురవీధులలో గ్రామోత్సవం జరుగుతుంది. అయితే రెండవ రోజు శ్రీశైలం భ్రమరాంబాదేవి మహాదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. రాత్రి కైలాసవాహనంపై స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించనున్నారు. మూడవరోజు అమ్మవారు మహా సరస్వతి అలంకారంలో భక్తులకు కనువిందు చేయనున్నారు. స్వామి అమ్మవార్లు నందీ వాహనంలో కొలువుదీరి శ్రీశైలం పురవీధులలో బాజా బజంత్రీలు నడమ బ్యాండ్ వాయిద్యాలు కోలాటాలు డప్పు చప్పుళ్ల‌ నడమ శ్రీశైలం పురవీధులలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఉగాది మహోత్సవాలలో నాలుగవరోజు ఉగాది పర్వదినం రోజున అమ్మవారు రమావాణిరాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఉగాది పర్వదినం కావడంతో సాయంత్రం స్వామిఅమ్మవార్లు రథోత్సవంలో కన్నులపండువగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉగాది పర్వదినం కావడంతో కన్నడిగులు శివదీక్షా శిభిరాలలో రాత్రి వీరాచార విన్యాసాలు అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమాలు ఉంటాయి. కన్నడిగులు భక్తి ప్రపత్తులతో అగ్నిగుండ ప్రవేశం చేసి నిప్పుకనికులలో నడుస్తూ తమ భక్తిని చాటుకుంటారు. అయితే 5వ రోజు ఉగాది ‌మహాత్సవాలలో చివరోజు శ్రీశైలం భ్రమరాంబదేవి నిజ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తుంది. ఆశ్వవాహనంలో స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..