AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Remedies: నవ గ్రహ దోష నివారణకు బెల్లం, శనగలు బెస్ట్ రెమిడీ.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బెల్లం, శనగపప్పు నివారణతో కుజ గ్రహాన్ని మాత్రమే కాదు సూర్యుడు, గురు , శని గ్రహాలకు సంబంధించిన దోషాలను కూడా తొలగించవచ్చు. బెల్లంకు సంబంధించిన కొన్ని సాధారణ నివారణలను మనం ఈ రోజు  తెలుసుకుందాం.. ఇలా చేయడం ద్వారా ఒక వ్యక్తి జీవితంలోని అన్ని రకాల సమస్యల నుంచి  బయటపడతాడు. అదృష్టం కలిసి వచ్చి పట్టిందల్లా బంగారంగా మారుతుంది. 

Astro Remedies: నవ గ్రహ దోష నివారణకు బెల్లం, శనగలు బెస్ట్ రెమిడీ.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే..
Astro Remedies
Surya Kala
|

Updated on: Apr 06, 2024 | 7:36 AM

Share

బెల్లం, శనగలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. వీటి ద్వారా ఆనందం, అదృష్టాన్ని కూడా పొందవచ్చు. హిందూ విశ్వాసం ప్రకారం బెల్లం, శనగలకు సంబంధించిన జ్యోతిష పరిహారాలను  చేయడం ద్వారా నవ గ్రహాలకు సంబంధించిన దోషాలు తొలగిపోతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బెల్లం, శనగపప్పు నివారణతో కుజ గ్రహాన్ని మాత్రమే కాదు సూర్యుడు, గురు , శని గ్రహాలకు సంబంధించిన దోషాలను కూడా తొలగించవచ్చు. బెల్లంకు సంబంధించిన కొన్ని సాధారణ నివారణలను మనం ఈ రోజు  తెలుసుకుందాం.. ఇలా చేయడం ద్వారా ఒక వ్యక్తి జీవితంలోని అన్ని రకాల సమస్యల నుంచి  బయటపడతాడు. అదృష్టం కలిసి వచ్చి పట్టిందల్లా బంగారంగా మారుతుంది.

బెల్లంతో జ్యోతిష్య పరిహారాలు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో కుజుడు బలహీనంగా ఉండి, అశుభ ఫలితాలు కలిగిస్తే దీనికి  సంబంధించిన దోషాలు లేదా సమస్యల నుండి బయటపడటానికి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి బెల్లం సమర్పించాలి. అలా చేయలేకపోతే బ్రహ్మచారికి బెల్లం దానం చేయాలి.

చేపట్టిన పనిలో ఆటంకాలు ఏర్పడి చాలా కాలంగా నిలిచిపోయి ఎన్ని ప్రయత్నాలు చేసినా పూర్తి కాకపోతే..  మంగళవారం రోజున బెల్లం ముక్కను నాణెంతో కలిపి ప్రవహిస్తున్న నీటిలో వేయాలి.

ఇవి కూడా చదవండి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బెల్లం అదృష్టాన్ని పెంచుతుంది. ఇది పూజలో ప్రత్యేకంగా ఉపయోగించబడటానికి కారణం. జీవనోపాధికి సంబంధించిన ఏదైనా ప్రత్యేక పని కోసం ఇంటిని విడిచి బయటకు వెళ్తుంటే.. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు బెల్లాన్ని ఆవుకు ఆహారంగా అందించండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పరిహారాన్ని అనుసరించడం ద్వారా కోరుకున్న విజయాన్ని పొందుతాడు. పెళ్లికాని అబ్బాయి లేదా అమ్మాయి ఈ జ్యోతిష్య పరిష్కారాన్ని అనుసరిస్తే  యువతి లేదా యువకుడికి త్వరలో వివాహం జరుగుతుంది.

శనగలతో జ్యోతిష్య నివారణ

రకరకాల సమస్యలు ఏర్పడి.. ప్రణాళికాబద్ధమైన పని కూడా చెడిపోతుంటే.. అన్ని ఇబ్బందులు తీరి సమస్యల నుంచి బయటపడడానికి ప్రత్యేకంగా సంకత్మోచన హనుమంతుడి పూజలో శనగలు, బెల్లం సమర్పించండి. ఇలా చేయడం సాధ్యం కాకపోతే మంగళవారం కోతులకు శనగలు, బెల్లాన్ని అందించండి.  అంతేకాదు ఎర్ర ఆవుకు ఆహారం అందించడం వలన కూడా శుభ ఫలితాలను పొందవచ్చు.

జీవితంలో సంతోషం, అదృష్టం కోసం గురువారం విష్ణువు ఆలయంలో పసుపు వస్త్రంలో శనగపప్పు,  బెల్లం సమర్పించండి.

శ్రీ విష్ణువు, హనుమంతుడు ఆశీర్వాదాల కోసం శనిశ్వరుడి సంబంధించిన దోషాలను కూడా తొలగించడానికి బెల్లాన్ని, శనగలు కలిసి దానం ఇవ్వండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం రోజున చేపలు తినేందుకు  నల్లబెల్లం  చెరువులో లేదా నదిలో వేస్తే శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు