రెస్టారెంట్‌లో నూడిల్స్‌ను ఆర్డర్ చేసిన కస్టమర్‌.. అందులో వచ్చిన వస్తువు చూసి షాక్..

ఇంటి నుంచి బయటకు అడుగు పెడితే చాలు.. ఖచ్చితంగా బయట ఆహారాన్ని తినడానికే ఆసక్తిని చూపిస్తున్నారు. కొందరు రెస్టారెంట్లలో తినడానికి ఆసక్తిని చూపిస్తే.. మరికొందరు స్ట్రీట్ ఫుడ్ ని తినడానికి ఆసక్తిని చూపిస్తారు. పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించే వ్యక్తులు బండి దగ్గర తినడం కంటే రెస్టారెంట్‌లో తినడం సముచితమని భావించినప్పటికీ.. ఒకొక్కసారి రెస్టారెంట్‌లో దొరికే ఆహారం కూడా బాబోయ్ ఇదేంటి ఇలా ఉంది అని ఆలోచించే విధంగా ఉంటుంది.

రెస్టారెంట్‌లో నూడిల్స్‌ను ఆర్డర్ చేసిన కస్టమర్‌.. అందులో వచ్చిన వస్తువు చూసి షాక్..
Band Aid In NoodlesImage Credit source: Facebook/Shawn Cgy
Follow us
Surya Kala

|

Updated on: Apr 06, 2024 | 11:19 AM

ప్రస్తుతం మారుతున్న కాలంతో పాటు ఆహారపు అలవాట్లు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడేవారు.. అయితే ఇప్పుడు పిజ్జా, బర్గర్ , మోమోస్, న్యుడిల్స్ వంటివి మన దేశంలో అడుగు పెట్టిన తర్వాత ఇంట్లో చేసిన ఆహారానికి బదులుగా స్ట్రీట్ ఫుడ్ ని తినడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. ఇంటి నుంచి బయటకు అడుగు పెడితే చాలు.. ఖచ్చితంగా బయట ఆహారాన్ని తినడానికే ఆసక్తిని చూపిస్తున్నారు. కొందరు రెస్టారెంట్లలో తినడానికి ఆసక్తిని చూపిస్తే.. మరికొందరు స్ట్రీట్ ఫుడ్ ని తినడానికి ఆసక్తిని చూపిస్తారు. పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించే వ్యక్తులు బండి దగ్గర తినడం కంటే రెస్టారెంట్‌లో తినడం సముచితమని భావించినప్పటికీ.. ఒకొక్కసారి రెస్టారెంట్‌లో దొరికే ఆహారం కూడా బాబోయ్ ఇదేంటి ఇలా ఉంది అని ఆలోచించే విధంగా ఉంటుంది.

అసలు విషయం ఏంటంటే.. ఓ వ్యక్తి రెస్టారెంట్‌లో తినడానికి వెళ్లి నూడుల్స్ ఆర్డర్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికి ఎదురుగా వేడి వేడి నూడుల్స్ వడ్డించారు. అతను తినడానికి నూడుల్స్ తీసుకోగానే గిన్నెలో చాలా విచిత్రమైన వస్తువు కనిపించింది. అది ఏమిటా అని తీసి చూడగానే అతనికి మతి పోయింది. అది బ్యాండ్-ఎయిడ్. ఇది శరీరంలోని ఏదైనా భాగంలో గాయం అయితే  మెడిసిన్ గా దీనిని ఉపయోగిస్తారు. ఈ వింత కేసు మలేషియాలోని ఓ రెస్టారెంట్‌లో చోటు చేసుకుంది.

ఇవి కూడా చదవండి

షాన్ జై అనే వ్యక్తి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్‌లో జరిగిన సంఘటనను వివరించాడు. అతను తన అత్తమామలతో కలిసి ఆహారం కోసం మలేషియాలోని సబాలో ఉన్న రెస్టారెంట్‌కు తీసుకెళ్లినట్లు చెప్పాడు. అక్కడ రైస్ నూడుల్స్ , గ్రిల్డ్ పోర్క్ ఆర్డర్ చేశాడు. అప్పుడు ఆహారం సర్వ్ చేసిన తర్వాత అతను తినడం ప్రారంభించాడు. అయితే అతను తింటున్న రైస్ నూడుల్స్ లోపల బ్యాండ్-ఎయిడ్‌ ను చూశాడు. అది చూసి అతను కూడా షాక్ అయ్యాడు. అప్పుడు షాన్ రెస్టారెంట్ మేనేజర్‌కి ఫోన్ చేసి ఇది ఏమిటి అని అడిగాడు. అది విని షాక్ తిన్న ఆమె వెంటనే వంటగది వైపు పరుగెత్తింది. తర్వాత వంటగదిలోంచి వచ్చి షాన్ చేతిలోంచి నూడుల్స్ తీసుకుని క్షమాపణ చెప్పింది.

ఈ విషయం చాలా సీరియస్ కావడంతో రెస్టారెంట్ యజమాని కూడా షాన్‌కి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత రెస్టారెంట్ యజమానులు అతనికి ఉచితంగా ఆహారం అందించారు. షాన్ , అతని బంధువులు మళ్లీ అక్కడే తిన్నారా లేదా అనేది తెలియనప్పటికీ.. ఈ వింత సంఘటన ఖచ్చితంగా షాన్, అతని బంధువులను షాక్ కు గురి చేసింది అని చెప్పవచ్చు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..