Leopard Viral Video: సాహసమంటే ఇది.! ఆయుధం లేకుండానే చిరుతతో పోరాటం.!
కశ్మీర్ లోని గాందర్బల్ జిల్లాలోని ఫతేపోరా గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపింది. బుధవారం ఓ చిరుత గ్రామంలోకి ప్రవేశించి జనాలను భయాందోళనలకు గురిచేసింది. ఇద్దరు మహిళలపై దాడి చేసి గాయపరిచింది. అదృష్టవశాత్తూ ఆ మహిళలు తప్పించుకున్నారు. గ్రామస్థుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది చిరుతను బంధించేందుకు ప్రయత్నించగా ముగ్గురు సిబ్బందిని గాయపరిచింది.
కశ్మీర్ లోని గాందర్బల్ జిల్లాలోని ఫతేపోరా గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపింది. బుధవారం ఓ చిరుత గ్రామంలోకి ప్రవేశించి జనాలను భయాందోళనలకు గురిచేసింది. ఇద్దరు మహిళలపై దాడి చేసి గాయపరిచింది. అదృష్టవశాత్తూ ఆ మహిళలు తప్పించుకున్నారు. గ్రామస్థుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది చిరుతను బంధించేందుకు ప్రయత్నించగా ముగ్గురు సిబ్బందిని గాయపరిచింది. చిరుతను ప్రాణాలతో పట్టి తీసుకెళ్లేందుకు ఓ ఉద్యోగి సాహసించి ఖాళీ చేతులతోనే దానితో తలబడ్డ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్రామస్థులు తెలిపిన సమాచారం ప్రకారం.. బుధవారం గ్రామంలోకి ఓ చిరుత వచ్చింది. వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్న చిరుతను చూసి భయాందోళనలకు గురైన జనం వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు గ్రామానికి చేరుకునేలోగా ఆ చిరుత ఇద్దరు మహిళలపై దాడి చేసి గాయపరిచింది. చిరుతను బంధించేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నించగా.. ఓ ఉద్యోగి చేతిని చిరుత నోటకరిచింది. ఓవైపు చిరుత నోట్లో తన చేతిని విడిపించుకునేందుకు ప్రయత్నిస్తూనే దానిని బంధించేందుకు ఆ ఉద్యోగి ప్రయత్నించాడు. ఇంతలో మిగతా సిబ్బంది, గ్రామస్థులు కలిసి కట్టెలతో చిరుతను కొట్టడంతో చేతిని విడిచిపెట్టింది. ఆ తర్వాత చిరుతకు మత్తుమందు ఇచ్చి బంధించారు. చిరుత దాడిలో గాయపడ్డ అటవీశాఖ సిబ్బందితో పాటు గ్రామస్థులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.