Elephant Attack: ఏనుగు దాడిలో ఇద్దరు తెలంగాణ రైతులు మృతి.! వీడియో..

Elephant Attack: ఏనుగు దాడిలో ఇద్దరు తెలంగాణ రైతులు మృతి.! వీడియో..

Anil kumar poka

|

Updated on: Apr 05, 2024 | 10:12 PM

తెలంగాణాలోని కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ కారిడార్ లో ఏనుగు భీభత్సం సృష్టించింది. 24 గంటల్లో ఇద్దరు రైతులను పొట్టన పెట్టుకుంది. మంద నుంచి వేరుపడిన ఓ మగ ఏనుగు మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సరిహద్దు దాటి ప్రాణహిత నదీ తీరం వెంట వస్తూ తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చింది. బూరుపెల్లిలోని మిర్చి తోటలోకి దూసుకొచ్చిన ఏనుగు క్షణాల్లో రైతు అల్లూరి శంకరయ్య ప్రాణాలు తీసింది.

తెలంగాణాలోని కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ కారిడార్ లో ఏనుగు భీభత్సం సృష్టించింది. 24 గంటల్లో ఇద్దరు రైతులను పొట్టన పెట్టుకుంది. మంద నుంచి వేరుపడిన ఓ మగ ఏనుగు మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సరిహద్దు దాటి ప్రాణహిత నదీ తీరం వెంట వస్తూ తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చింది. బూరుపెల్లిలోని మిర్చి తోటలోకి దూసుకొచ్చిన ఏనుగు క్షణాల్లో రైతు అల్లూరి శంకరయ్య ప్రాణాలు తీసింది. అలాగే కొండపల్లి గ్రామంలో పొలానికి నీరు పెడుతున్న బూర పోచయ్య అనే రైతును చంపేసింది. వరుస ఘటనలతో కాగజ్‌నగర్ కారిడార్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో పులుల సంచారంతో ఆదివాసీలు వణికిపోతున్నారు ఇప్పుడు ఏనుగు రాక వారిని మరింత భయాందోళనకు గురిచేసింది. అసలు కాగజ్ నగర్ కారిడార్ లోని అభయారణ్యం లోకి ఏనుగు ఎలా వచ్చిందో తెలియదని.. పంట చేలల్లో ఒక్కసారిగా ప్రత్యక్షమైన ఏనుగును చూసి భయబ్రాంతులకు గురైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అటవీశాఖ నిర్లక్ష్యం తోనే రైతు ప్రాణం పోయిందన్నారు స్థానికులు. మహారాష్ట్ర ఫారెస్ట్ ఆఫీసర్లు సమాచారం ఇచ్చినా బెజ్జూర్‌ రేంజ్ ఫారెస్ట్ అధికారులు, నదీ తీర గ్రామ ప్రజలను అప్రమత్తం చేయలేదని …సమాచారం ఇచ్చి ఉంటే ఏనుగు దాడిలో తమ రైతు ప్రాణం పోయి ఉండేది కాదని బూరుపెల్లి గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలిసారి కాగజ్ నగర్ కారిడార్ లో ఏనుగు సంచారంతో ఆదివాసీ రైతులు భయబ్రాంతులకు గురవుతున్నారు. 1 6 గ్రామాలలో అటవీశాఖ హై అలర్ట్ ప్రకటించింది. గ్రామస్తులెవరూ బయటకి రావద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..