నెలకు లక్షల్లో సంపాదన .. అద్దె ఇల్లు వద్దు.. నివసించడానికి కార్లు, వాహనాలే ముద్దు అంటున్న యువత..
ప్రస్తుతం ఇళ్లను వదిలి బస్సులు, ట్రక్కులలో నివసిస్తున్నారని మీకు తెలుసా. కొన్ని వాహనాలను ఇల్లుగా చేసుకుని జీవిస్తున్నారు.. ఈ ఇల్లు విదేశాలలో బాగా ప్రాచుర్యం పొందాయి. అక్కడి ప్రజలు ఇళ్లు కొనుక్కోకుండా బస్సులు, ట్రక్కులు కొనుక్కుని అందులోనే జీవిస్తున్నారు. ది సన్ నివేదిక ప్రకారం టామ్జిక్ ఇమోజెన్ ఆడమ్స్ అనే మహిళ మంచి మొత్తంలో డబ్బు సంపాదిస్తుంది. అయితే ఆమెకు ఇప్పటికీ ఆమెకు సొంత ఇల్లు లేదు. ఆమె వ్యాన్‌లో నివసిస్తోంది. ఆ వ్యాన్‌ను సాధారణ ఇళ్లలానే అన్ని రకాల సౌకర్యాలు ఉన్న ఇల్లుగా మార్చుకుంది.
ఎవరైనా సరే ఉద్యోగం కారణంగా ఇంటికి దూరంగా వేరే నగరంలో నివసిస్తుంటే.. వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ఇంటి అద్దె. వారి ఆదాయంలో ఎక్కువ భాగం ఇంటి అద్దెకే వెళ్తుంది. సొంత ఇల్లు ఎందుకు కొనుక్కోకూడదని భావిస్తారు కూడా.. తద్వారా ఇంటి అద్దె బాధలు తొలగిపోతాయి. ఇంటి అద్దె కష్టాలు కూడా తొలగిపోతాయి. అయితే ప్రస్తుతం ఇళ్లను వదిలి బస్సులు, ట్రక్కులలో నివసిస్తున్నారని మీకు తెలుసా. కొన్ని వాహనాలను ఇల్లుగా చేసుకుని జీవిస్తున్నారు.. ఈ ఇల్లు విదేశాలలో బాగా ప్రాచుర్యం పొందాయి. అక్కడి ప్రజలు ఇళ్లు కొనుక్కోకుండా బస్సులు, ట్రక్కులు కొనుక్కుని అందులోనే జీవిస్తున్నారు.
ది సన్ నివేదిక ప్రకారం టామ్జిక్ ఇమోజెన్ ఆడమ్స్ అనే మహిళ మంచి మొత్తంలో డబ్బు సంపాదిస్తుంది. అయితే ఆమెకు ఇప్పటికీ ఆమెకు సొంత ఇల్లు లేదు. ఆమె వ్యాన్‌లో నివసిస్తోంది. ఆ వ్యాన్‌ను సాధారణ ఇళ్లలానే అన్ని రకాల సౌకర్యాలు ఉన్న ఇల్లుగా మార్చుకుంది. ఆడమ్స్ గత రెండు సంవత్సరాలుగా అదే వ్యాన్ హౌస్‌లో నివసిస్తుస్తోంది. అంతేకాదు ఆ వ్యాన్ సహాయంతో ఆమె జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్ వంటి దేశాల సహా అనేక దేశాలను కూడా సందర్శించింది.
అద్దె డబ్బును ఆదా చేయడానికి ప్రత్యేకమైన ట్రిక్
వాస్తవానికి ఆడమ్స్ వాన్‌ను తన ఇంటిగా చేసుకుంది. తద్వారా అద్దెగా ఇవ్వాల్సిన డబ్బును ఆదా చేస్తుంది. అయితే 25 ఏళ్ల ఆడమ్స్ సీనియర్ మార్కెటింగ్ క్యాంపెయిన్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. ఆమె జీతం సంవత్సరానికి దాదాపు రూ. 30 లక్షలు అంటే నెలకు దాదాపు రూ. 2.5 లక్షలు అన్న మాట. ఆమె కోరుకుంటే, తన సొంత ఇంటిని సులభంగా కొనుగోలు చేయవచ్చు. అయితే ఆమె వ్యాన్‌లో నివసిస్తుంది. ఆడమ్స్ ఈ వ్యాన్‌ను 2020 సంవత్సరంలో కొనుగోలు చేసి దానిని ఇల్లుగా మార్చుకున్నట్లు చెప్పింది. దీని కోసం ఆమె దాదాపు రూ.4 లక్షలు వెచ్చించాల్సి వచ్చింది.
వ్యాన్ హౌస్ డిజైన్
ఇప్పుడు ఆమె నెలవారీ అద్దెపై డబ్బును ఆదా చేయడమే కాకుండా తన వ్యాన్ హౌస్‌ను స్వయంగా డిజైన్ చేసుకుని నిర్మించుకున్నట్లు ఆడమ్స్ చెప్పారు. ఇలా చేయడం ద్వారా దాదాపు రూ.17 లక్షలు ఆదా చేసుకుంది. వ్యాన్ హౌస్‌లో ఆడమ్స్ లా ఒంటరిగా ఉండటమే కాదు.. బస్సులు, ట్రక్కులను కొనుగోలు చేసి వాటిని గృహాలుగా మార్చుకుని వాటిలో నివసిస్తున్నారు. ప్రపంచాన్ని ప్రయాణిస్తున్న వారు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..