Rasgulla Easy Recipe: రసగుల్లా అంటే ఇష్టమా.. ఇంట్లోనే ఈజీగా టేస్టీ టేస్టీ రసగుల్లాను తయారు చేసుకోండి.. రెసిపీ మీ కోసం
భారతీయులు ఆహార ప్రియులు. మన దేశంలో ఒకొక్క ప్రాంతం ఒకొక్క రకమైన ఆహారానికి ప్రసిద్ధి చెందింది. కోనసీమ పూతరేకులు, బెంగాలీ రసగుల్ల, ఇలా రకరకాల ఆహారంతో ప్రసిద్ది గాంచింది. ఇంట్లో ఏ విధమైన ఫంక్షన్ జరిగినా.. శుభకార్యాలు జరిగినా సరే తప్పనిసరిగా స్వీట్ ఉండాల్సిందే. అలా ఇప్పుడు కోల్కతాలోని రసగుల్లా ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రధాన పాత్ర చోటు చేసుకుంది. ఇటీవల కోల్కతాకు చెందిన రసగుల్లా జీఐ టైటిల్ను అందుకుంది. దుకాణంతో రసగుల్లా రుచిలో తేడా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం విభిన్న రుచుల రసగుల్లాలు మార్కట్ లో లభ్యం అవుతున్నాయి. అయితే వీటి కోసం దుకాణాలపైనే ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.
Rasgulla Easy Recipe1Image Credit source: pexels
Follow us
మిఠాయిలంటే ముందుగా గుర్తొచ్చేది రసగుల్లా. పండగలు, పర్వదినాలు, ఫంక్షన్లు ఇలా ఏ సందర్భం వచ్చినా సరే స్వీట్స్ ఉండాల్సిందే.. వాటిల్లో రసగుల్లా ప్రధాన చోటుని దక్కించుకుంటుంది. మొత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే రసగుల్లా చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి మనసుని దోచుకుంటుంది.
ఈ రసగుల్లాలను తినాలంటే దుకాణాలపైనే ఆధారపడాల్సిన అవసరం లేదు. మీరు చాలా సులభంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. రసగుల్లాను తయారు చేయడానికి పాలు, చక్కెర లేదా బెల్లం, కొంచెం రవ్వ, నిమ్మ రసం, ఏలకుల పొడి, కొంచెం కుంకుమ పువ్వు అవసరం.
ముందుగా పాలు తీసుకుని బాగా మరిగించాలి. పాలు చిక్కగా అయ్యాక కొన్ని చుక్కల నిమ్మరసం వేయాలి. అప్పుడు పాలు విరిగి పన్నీరు తయారు అవుతుంది. ఇలా పాలను విరచడానికి నిమ్మరసానికి బదులుగా వెనిగర్ ను కూడా ఉపయోగించవచ్చు
విరిగిన పాలను శుభ్రమైన కాటన్ క్లాత్లో వేసి నీటిని వడకట్టండి. తర్వాత పాలను పిండి.. పన్నీర్ మిగిలే విధంగా చేసి అప్పుడు ఆ పన్నీరుని ఒక ప్లేట్ లో తీసుకోవాలి. అప్పుడు పన్నీర్ ని మెత్తగా చేసి అందులో కొంచెం రవ్వ, పంచదార పొడి వేసి బాగా కలపండి. ఇష్టపడే వారు యాలకుల పొడిని కూడా కలుపుకోవచ్చు.
ఈ పన్నీరు మిశ్రమాన్ని గుండ్రంగా .. లేదా ఒవెల్ షేప్ లో చేసుకోవాలి. మరోవైపు పంచదార సిరా చేసుకోవడానికి ఒక దళసరి పాత్రను తీసుకుని అందులో చక్కర లేదా బెల్లం వేసి.. తగినంత నీరు వేసి మరిగించాలి.
పంచదార నీళ్ల మిశ్రమం బాగా మరుగుతున్నప్పుడు యాలకుల పొడిని వేసి పన్నీరు బాల్స్ ను జోడించండి. 10-15 నిమిషాలు పన్నీర్ బాల్స్ ను ఉడకబెట్టండి. తర్వాత అలా పంచదార పాకంలో పన్నీర్ బాల్స్ ను 30 నిమిషాలు వదిలివేయండి. అప్పుడు అందరికీ ఇష్టమైన రసగుల్లా రెడీ అవుతుంది.
వేడివేడి రసగుల్లా తినాలనుకుంటే రసం తీసి సర్వ్ చేయండి. అయితే రసగుల్లా చల్లగా తినడం మంచిది. కనుక రసగుల్లా బాగా చల్లారిన తర్వాత పైన కొంచెం పిస్తా పొడి, కుంకుమ పువ్వు చల్లి సర్వ్ చేయాలి. మార్కెట్ లో దొరికే రసగుల్లా టెస్ట్ కు ఏ మాత్రం తగ్గ రుచితో ఉండి ఆహా ఏమి రుచి అనిపిస్తాయి ఈ రసగుల్లాలు .