Telangana: గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని తిరుమల వెళ్తున్న భక్తులకు ఊహించని షాక్..!
గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని తిరుమల వెళ్తొన్న భక్తులకు ఊహించని ప్రమాదం ఎదురైంది. టెక్నాలజీని నమ్ముకుని వెళ్తుండగా జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గూగుల్ మ్యాప్ డైరెక్షన్‌లో వెళ్తున్న కారు వాగులో పడిపోయింది. వడ్లకొండ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు .

గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని తిరుమల వెళ్తొన్న భక్తులకు ఊహించని ప్రమాదం ఎదురైంది. టెక్నాలజీని నమ్ముకుని వెళ్తుండగా జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గూగుల్ మ్యాప్ డైరెక్షన్‌లో వెళ్తున్న కారు వాగులో పడిపోయింది. వడ్లకొండ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు
మహారాష్ట్రకు చెందిన కొందరు యువకులు నాగపూర్ నుంచి తిరుపతికి వెళ్తున్నారు. గూగుల్ మ్యాప్ ని నమ్ముకుని జనగామ జిల్లా మీదుగా వెళ్తుండగా కారు గుంతలో పడింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డవారిని రక్షించారు. యాక్సిడెంట్ జరిగిన దగ్గర బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. బ్రిడ్జి నిర్మాణ ప్రాంతంలో ఎలాంటి హెచ్చరికల బోర్డులు పెట్టకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వీడియో చూడండి..
మరిన్ని హ్యమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..