Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆషాడంలో గోరింటాకు స్పెషల్.. ఎందుకు పెట్టుకోవాలంటే..!

ఆషాడం అనగానే గోరింటాకు గుర్తుకొస్తుంది. ముఖ్యంగా మహిళలు.. ఈ సీజన్లో గోరింటాకు ఎక్కువగా వాడుతారు. అది కూడా సహజంగా లభించే.. గోరింటాకును మాత్రమే.. చేతికి, కాళ్లకు పెట్టుకుంటారు. ఇప్పుడు.. ఆషాడమాసంలో.. గోరింటాకు ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు మహిళలు..ఇప్పుడు.. ఏ వాడలో చూసిన ఈ వేడుకలు చేసుకుంటున్నారు. కొత్తగా పెళ్లైన వధువులు మాత్రం ఖచ్చితంగా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ గోరింటాకుతో... వివి ధ రకాల డిజైన్స్ కూడా వేసుకుంటున్నారు.

ఆషాడంలో గోరింటాకు స్పెషల్..  ఎందుకు పెట్టుకోవాలంటే..!
Mehandi In Ashadam
G Sampath Kumar
| Edited By: Jyothi Gadda|

Updated on: Jul 05, 2025 | 11:22 AM

Share

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.. ఎప్పుడు ఎక్కడ చూసిన సందడి కనబడుతుంది.. ఆషాడం సందర్భంగా గోరింటాకు ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నారు.. గోరింటాకును తీసుకొని కొంత మంది మహిళలు ఒక్క వద్ద చేరుకొని.. అక్కడ గోరింటాకు తయారు చేస్తున్నారు. అంతేకాకుండా.. చేతులు, కాళ్లకు ఈ గోరింటాతో ముస్తాబమవుతున్నారు. గోరింటాకు నియోగిస్తే.. వేడి తగ్గుతుందనే నమ్మకం.. ముఖ్యంగా.. నూతన వధువులు.. ఈ సీజన్లో తప్పకుండా నియోగిస్తున్నారు. పెళ్లి కాని.. అమ్మాయిలు.. గోరింటాకు ఎంత ఎర్రగా పండితే.. అంతా మంచి భర్త వస్తాడనే నమ్మకం..

ఇప్పుడు గ్రామాల కంటే.. పట్టణాల్లోనే ఈ కల్చర్ బాగా పెరిగిపోయింది. కిట్టి పార్టీ మహిళలు.. ప్రత్యేక ఉత్సహాలను ఏర్పాటు చేస్తున్నారు. గోరింటాకు.. చెట్టు కొమ్మలు తీసుకవచ్చి.. అక్కడ తెంపి.. ధ రకాల పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.. ఒక్క రోజంతా ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ సీజన్లో మాత్రమే.. అధికంగా గోరింటాకు లభిస్తుంది..

అంతేకాదు.. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా గోరింటాకు చెట్టు ఉంది.. ఇప్పుడు.. ఏ వాడలో చూసిన ఈ వేడుకలు చేసుకుంటున్నారు. కొత్తగా పెళ్లైన వధువులు మాత్రం ఖచ్చితంగా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ గోరింటాకుతో… వివి ధ రకాల డిజైన్స్ కూడా వేసుకుంటున్నారు. అదే వి ధంగా కళాశాల్లో కూడా.. గోరింటాకు వేడుకలు నిర్వహిస్తున్నారు. అర చేతిలో గోరింటాకు పెట్టుకుంటే.. శరీరంలో ఉన్న వేడి వెళ్లి.. చల్లగా మారుతుందనే నమ్మకం..

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకపోవడంతో.. ప్రతి ఒక్కరు.. ఈ గోరింటాకు వాడుతున్నారు. అదే వి ధంగా పల్లెల్లో కూడా.. ఈ సీజన్లో గోరింటాకు.. అధికంగా వాడుతున్నారు.. ఆషాడం పూర్తయ్యే వరకు.. గోరింటాకు వాడుతుంటారు.. ఎన్నడూ లేని విధంగా.. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో గోరింటాకు ఉత్సహాలు నిర్వహించుకుంటున్నారు. ఉదయం నుంచీ సాయంత్రం వరకు ఈ వేడుకలు జరుగుతున్నాయి..

ఓవైపు ఆరోగ్యంతో పాటు మరో వైపు ఉల్లాసంగా గడుపుతున్నారు.. ఖచ్చితంగా ఆషాడ మాసం సీజన్లో గోరింటాకు పెట్టుకుంటామని మహిళలు చెబుతున్నారు. శరీరానికి ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. మొత్తానికి.. ప్రతి మహిళ.. ఈ సీజన్లో గోరింటాకును పెట్టుకుంటున్నారు..

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..