Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anjeer Health Benefits: అంజీర్ పండు కాదు, ఆకులోనూ బోలెడన్నీ ప్రయోజనాలు…అసలు రహస్యం తెలిస్తే..

ప్రకృతిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల ఔషధ మొక్కలు, మూలికలు అనేకం ఉన్నాయి. కానీ, వాటి ప్రత్యేకత, ప్రాముఖ్యత తెలియక మనం వాటిని విస్మరిస్తాం. అటువంటి వాటిల్లో ముఖ్యమైనవి అంజీర్‌ పండ్లు. వీటిని అత్తిపండ్లు అని కూడా అంటారు. ఈ పండులో ప్రకృతి సహజంగా ఆరోగ్యానికి కావలసిన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. డ్రై అంజీర్‌ పండ్లలో ఖనిజాలు, విటమిన్ల నిధిగా పిలుస్తారు. బలహీనంగా ఉన్నవారు అంజీర్‌ తింటే.. కొన్ని రోజుల్లోనే ఆశించిన మార్పు వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంజీర్‌లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మరిన్ని ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం...

Jyothi Gadda
|

Updated on: Jul 05, 2025 | 8:56 AM

Share
అత్తిపండ్లలో ఫైబర్‌, ఎ, బి, సి, ఇ, కె విటమిన్లు, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్‌, కాల్షియం, జింక్‌, ఫొలేట్‌, రిబోఫ్లేవిన్‌, భాస్వరం మెండుగా ఉన్నాయి. తరచూ అంజీర్‌ పండ్లు తీసుకోవటం వల్ల రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్‌ స్థాయిని నియంత్రించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది.

1 / 5
అంజీర్‌ పండుతో ఊపిరితిత్తుల్లో సమస్యలు, శ్వాసలో ఇబ్బందులను తొలగిస్తుంది. ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచుతుంది. పైల్స్‌ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నిద్రలేమిని దూరం చేస్తుంది. జుట్టు సమస్యలను సైతం నివారిస్తుంది. ఒత్తైన, బలమైన జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది.

2 / 5
అంజీర్ పండ్లే కాదు ఆకులు కూడా ఆరోగ్యానికి బోలెడంత మేలు చేస్తాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంజీర్‌ ఆకుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అంజీర్ ఆకులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడే సమ్మేళనాలను కలిగి ఉంటాయి.

3 / 5
మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా అంజీర్ ఆకులను తింటే ఇన్సులిన్ అవసరం తగ్గుతుంది. అంజీర్ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు దీర్ఘకాలిక వ్యాధులతో సంబంధం ఉన్న ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

4 / 5
అంతేకాదు.. అంజీర్ ఆకులు మూత్ర సంబంధిత వ్యాధుల్ని సైతం నివారిస్తుంది. సహజ మూత్రవిసర్జన మందుగా పనిచేస్తాయి. మూత్ర నాళం, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అంజీర్ ఆకుల రసం దాని ప్రోటీయోలైటిక్ ఎంజైమ్‌ల కారణంగా మొటిమలను తొలగించగలవు.

5 / 5