భార్య కాపురానికి రావడం లేదని దారుణం.. అత్తమామలను కత్తితో పొడిచి..
వారి కుమార్తె పూనమ్ తన భర్తతో గొడవల కారణంగా తల్లిదండ్రుల ఇంట్లో ఉంటుంది. బుధవారం రాత్రి పూనమ్‌ను తీసుకెళ్లేందుకు భర్త జగదీప్ సింగ్ రాగా, ఆమె వెళ్ళడానికి నిరాకరించింది. ఈ క్రమంలో వారివురి మధ్య మాట మాటా పెరిగి గొడవకు దారి తీసింది. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహనికి గురైన జగదీప్ సింగ్ కోపంతో అత్తమామలను కత్తితో పొడిచేశాడు.

భార్య కాపురానికి రావడం లేదని ఓ అల్లుడు అత్తమామలను కత్తితో పొడిచి చంపేశాడు. ఈ షాకింగ్ ఘటన లక్నోలోని అలంబాగ్ విజయ్ ఖేడా తూర్పు ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలం సృష్టించింది. కుటుంబ వివాదం కారణంగా జరిగిన ఈ జంట హత్య ఆ ప్రాంతంలో భయాందోళనలు రేకెత్తించింది. ఈ సంఘటన తర్వాత స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
లక్నోలోని అలంబాగ్‌లోని గాధి కనోరా ప్రాంతంలో బుధవారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. మృతులు అనంత్‌రామ్ (80), ఆశాదేవి (75) లక్నోలోని అలంబాగ్ విజయ్ ఖేడా తూర్పు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వారి కుమార్తె పూనమ్ తన భర్తతో గొడవల కారణంగా తల్లిదండ్రుల ఇంట్లో ఉంటుంది. బుధవారం రాత్రి పూనమ్‌ను తీసుకెళ్లేందుకు భర్త జగదీప్ సింగ్ రాగా, ఆమె వెళ్ళడానికి నిరాకరించింది. ఈ క్రమంలో వారివురి మధ్య మాట మాటా పెరిగి గొడవకు దారి తీసింది. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహనికి గురైన జగదీప్ సింగ్ కోపంతో అత్తమామలను కత్తితో పొడిచి చంపాడు. ఆమె అరుపులు విన్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని, జగదీప్‌ను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు.
అలంబాగ్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. నేరానికి ఉపయోగించిన రక్తపు మరకలున్న కత్తిని అతని వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. ఆ జంటను లోక్బంధు ఆసుపత్రికి తరలించారు. కొన ఊపిరితో ఉన్న ఆ ఇద్దరు ఆస్పత్రికి చేరుకునేలోపే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…