Gold Rate Hike: మళ్లీ భారీగా పెరిగిన గోల్డ్ రేట్.. తులం ఎంతకు పలుకుతుందంటే..?
పసిది ధరలు మరింత ప్రియమయ్యాయి. బంగారం ధరలు మళ్ళీ ఆల్ టైం రికార్డు దిశగా అడుగులు పెడుతున్నాయి. వరుసగా మూడోరోజు బుధవారం కూడా పుత్తడి ధర పెరిగింది. ఏకంగా రూ.99 వేలకు చేరింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో గోల్డ్‌కి డిమాండ్ ఎక్కువగా ఉండటంతోపాటు అంతర్జాతీయంగా కొనుగోళ్లు ఊపందుకోవడం కూడా బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. బంగారంపై పెట్టుబడి పెట్టాలని చూస్తున్న వారికి ఇది సరైన టైమ్ అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇకపోతే, ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

దేశంలో బంగారం ధర భారీగా పెరిగింది. ఆషాఢ మాసం పండుగల సీజన్, శ్రావణ మాసం పెళ్లిల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి షాకిస్తూ పసిడి పరుగులు పెడుతోంది. జూన్ నెలాఖరున వరుసగా 7-8 రోజులుగా తగ్గిన గోల్డ్ ధర ఇప్పుడు వరుసగా పెరుగుతోంది. జూలై మొదటి రోజునుండి బంగారం ధర భారీగా పెరుగుతూ వస్తోంది. ఈరోజు కూడా గోల్డ్ రేట్ పెరిగింది. ప్రముఖ నగరాలు, పట్టణాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..
– ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.99,050, 22 క్యారెట్ల ధర రూ.90,810 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,09,900 లుగా ఉంది.
– ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.98,900, 22 క్యారెట్ల ధర రూ.90,660 ఉంది. వెండి ధర కిలో రూ.1,09,900 గా ఉంది.
– చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.98,900 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.90,660 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,20,100 లుగా ఉంది.
– బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.98,900, 22 క్యారెట్ల ధర రూ.90,660 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,19,900 లుగా ఉంది.
– హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,900 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.90,660 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,19,900 గా ఉంది.
– విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,900, 22 క్యారెట్ల ధర రూ.90,660లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,19,900 లుగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..