మరో ఎయిర్ ఇండియా ఫ్లైట్‌కు తప్పిన భారీ ముప్పు.. మధ్యలో ఆగిపోయిన ఢిల్లీ-వాషింగ్టన్ డిసి విమానం
మరో ఎయిర్ ఇండియా విమానంలో పెద్ద సమస్య తలెత్తింది. ఢిల్లీ నుండి వాషింగ్టన్ డిసికి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ఇంధనం నింపుకోవడం కోసం వియన్నాలో ఆపివేశారు. ఈ సమయంలో, ఇక్కడ సాధారణ తనిఖీ చేసినప్పుడు, విమానంలో సాంకేతిక సమస్య ఉన్నట్లు తేలింది. దీంతో వియన్నా చేరుకున్న తర్వాత విమానం రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.

మరో ఎయిర్ ఇండియా విమానంలో పెద్ద సమస్య తలెత్తింది. ఢిల్లీ నుండి వాషింగ్టన్ డిసికి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ఇంధనం నింపుకోవడం కోసం వియన్నాలో ఆపివేశారు. ఈ సమయంలో, ఇక్కడ సాధారణ తనిఖీ చేసినప్పుడు, విమానంలో సాంకేతిక సమస్య ఉన్నట్లు తేలింది. దీంతో వియన్నా చేరుకున్న తర్వాత విమానం రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. అయితే ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
ఎయిర్ ఇండియా ప్రతినిధి విమానం గురించి పూర్తి సమాచారం ఇచ్చారు. “ఎయిర్ ఇండియా విమానం AI 103 జూలై 2న ఢిల్లీ నుండి వాషింగ్టన్ DCకి బయలుదేరింది. వియన్నా (ఆస్ట్రియా) చేరుకున్న తర్వాత, విమానంలో ఇంధనం నింపుతున్నారు. ఇక్కడ సాధారణ తనిఖీ సమయంలో, విమానంలో సాంకేతిక సమస్య ఉన్నట్లు తేలింది. దాన్ని సరిచేయడానికి మరింత సమయం పట్టింది. దీని కారణంగా, విమాన సర్వీసు రద్దు చేశాము” అని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.
విమానం రద్దు అయిన తర్వాత, ప్రయాణీకులందరికీ మరొక ఎంపిక ఇచ్చామని ఎయిర్ ఇండియా తెలిపింది. వారికి మరొక విమాన బుకింగ్ లేదంటే పూర్తిగా టికెట్ డబ్బు వాపసు ఇవ్వడం జరిగింది. ప్రయాణీకులు బస చేయడానికి హోటల్ ఏర్పాట్లు కూడా ఎయిర్ ఇండియా చేసింది. విమానం సాంకేతిక సమస్య గురించి సమాచారం అందుకున్న తర్వాత, ప్రయాణీకులందరినీ సురక్షితంగా వియన్నాలోనే దింపారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం AI-171 ప్రమాదానికి గురైంది. విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది మరణించారు. విశ్వాస్ కుమార్ రమేష్ అనే ఒక ప్రయాణీకుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదం తర్వాత, ఇప్పటివరకు ఎయిర్ ఇండియాకు చెందిన అనేక విమానాలు రద్దు అయ్యాయి. ఈ సంఘటన తర్వాత ఎయిర్ ఇండియా కూడా తన అన్ని విమానాలను తిరిగి తనిఖీ చేసింది. అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు వెలుగు చూస్తుండటం ప్రయాణికులను మరింత ఆందోళన కలిగిస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..