US Student Visas: వీసాలు ఇస్తాం.. కానీ ఆ రూల్స్ పాటించే వారికే.. స్టూడెంట్ వీసాలను తిరిగి ప్రారంభించిన అమెరికా!
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే విద్యార్థులకు ట్రంప్ సర్కార్ స్వల్ప ఊరటనిచ్చింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమల్లోకి తెచ్చిన ఆంక్షలను సడలిస్తూ అమెరికా వచ్చే విద్యార్థులకు కోసం స్టూడెంట్ వీసాలను తిరగి ప్రారంభించింది. కానీ ఈసారి వీసా దరఖాస్తుదారులకు కొన్ని కఠినమైన రూల్స్‌తో పాటు కీలక హెచ్చరికలను అమెరికా జారీ చేసింది. ఆ రూల్స్ పాటించే వారికి మాత్రమే వీసా మంజూరు చేయనున్నట్టు పేర్కొంది.

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతు చేపట్టిన తర్వాత దేశంలో కీలక మార్పులు తీసుకువచ్చారు. ముఖ్యంగా దేశంలోని అక్రమ వలసదారులను తరిమేయడంతో పాటు చదువు పేరుతో వచ్చి అక్కడ జాబ్స్ చేస్తున్న వారిపై కొరడా జులిపించాడు. ఆ తర్వాత స్టూడెంట్ వీసాల జారీ ప్రక్రియను నిలిపివేశారు. అయితే తాజాగా ఈ స్టూడెంట్ వీసాల జారీ ప్రిక్రియను పుణఃప్రారంభిస్తూ.. స్టూడెంట్ విసాపై అమెరికా వచ్చే విధ్యార్థులకు కొన్ని కీలక హెచ్చరికలు ట్రంప్ స్కార్ జారీ చేసింది. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మిగ్నాన్ హ్యూస్టన్ మాట్లాడుతూ.. తమ దేశంలో చదువుకునేందుకు వచ్చే వారికి ఇప్పుడు స్టూడెంట్ వీసాల అందుబాటులో ఉన్నాయని, ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కానీ విద్యార్థులు కొన్ని విషయాలను మాత్రం స్పష్టంగా గుర్తించుకోవాలని తెలిపారు.
అయితే అమెరికా వచ్చే విద్యార్థులు ఏ ఉద్దేశంతో అయితే వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పని కోసం మాత్రమే మీవీసాను ఉపయోగించుకోవాలని తెలిపారు. అలా కాకుండా చదువును మధ్యలో వదిలేయడం, లేదా క్యాంపస్‌లలో విధ్వంసానికి పాల్పడటం వంటి చర్యలను ఏమాత్రం సహించబోమని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాకుండా దేశ జాతీయ భద్రత, వలస చట్టాలను దృష్టిలో ఉంచుకునే తమ విధానాలు ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలు కేవలం అమెరికా పౌరులకు మాత్రమే కాకుండా, స్టూడెంట్ వీసాపై ఇక్కడికి వచ్చి వారితో కలిసి చదువుకునే ఇతర దేశాల విద్యార్థుల భద్రతకు కూడా అవసరమని ఆమె తెలిపారు.
సోషల్ మీడియాపై కఠిన నిఘా..
గత రెండు నెలల క్రితం నిలిపివేసిన స్టూడెంట్ వీసాల జారీ ప్రక్రియను తిరిగి ప్రారంభించిన అమెరికా.. అక్కడికి వచ్చి విద్యార్థుల సోషల్ మీడియాపై కొన్ని షరతలును విధించింది. కొత్తగా వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తమ అన్ని సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను తప్పనిసరిగా ‘పబ్లిక్‌లో ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనను పాటించకుండా.. ఎవరైనా తమ ఖాతాలను ప్రైవెట్‌లో ఉంచుకుంటే వారి దరఖాస్తులను తిరస్కరించడమే కాకుండా, భవిష్యత్తులో వారు అమెరికాకు వచ్చే అవకాశాలను కూడా కోల్పోతారని తేల్చిచెప్పింది.
అంతేకాకుండా విద్యార్థి వీసాలకు కూడా నిర్దిష్ట కాలపరిమితి విధించాలని అమెరికా యోచిస్తోంది. అందుకోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. దీంతో ఈ ఆంక్షలు విదేశీ విద్యార్థుల్లో కొత్త ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఎఫ్-1, జె-1 వీసాలపై అమెరికాలో ఉంటున్న విద్యార్థులపై ప్రత్యక్ష ప్రభావం పడే అవకాశం ఉంది. ఒక వేలా ఈ విధానాన్ని కనుక అమెరికా ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తే వీసా గడువు ముగిసిన ప్రతిసారీ విద్యార్థులు పొడిగింపు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రతిపాధనపై ఇంకా చర్చలు మాత్రమే జరుగుతున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.