AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Japan Baba Vanga: జపాన్‌ని భయపెడుతున్న న్యూ బాబా వంగా అంచనా.. రెండు రోజుల్లో ఏం జరగనుంది..?

జపనీస్ బాబా వాంగగా ప్రసిద్ధి చెందిన రియో టాట్సుకి జూలై 5, 2025న భారీ భూకంపం వస్తుందని చెప్పిన అంచనాతో జపాన్ ఆందోళన చెందుతోంది. అయితే రియో వేసిన అంచనాలు నిజం కాదని.. భయం వద్దు ప్రజలు ప్రశాంతంగా ఉండాలని జపాన్ అధికారులు కోరుతున్నారు. అయినప్పటికీ ప్రజలు రియో టాట్సుకి మాటలను విశ్వసిస్తూ భయభ్రాంతులకు గురవుతున్నారు.

Japan Baba Vanga: జపాన్‌ని భయపెడుతున్న న్యూ బాబా వంగా అంచనా.. రెండు రోజుల్లో ఏం జరగనుంది..?
New Baba Vanga Prediction
Surya Kala
|

Updated on: Jul 03, 2025 | 1:44 PM

Share

బల్గేరియా దేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వాంగ మాదిరి గానే జపనీస్ బాబా వాంగగా ప్రసిద్ధి చెందిన రియో టాట్సుకి కూడా భవిష్యత్ లో జరగనున్న సంఘటనలు అంచనా వేస్తుందని నమ్మకం. అయితే రియో 2025 జులై నెల గురించి చెప్పిన ఓ వార్తతో ఇప్పుడు జపాన్ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపించింది. జూలై 5, 2025 తేదీ సమీపిస్తున్న కొద్దీ రియో ​​టాట్సుకి రాసిన 1999 మాంగా “వాటాషి గ మితా మిరాయ్” (ది ఫ్యూచర్ ఐ సా అంటే నేను చూసిన భవిష్యత్తు)లోని అంచనాపై జపాన్ తీవ్ర ఆందోళన చెందుతోంది.

ఈ నెల 5వ తేదీన జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య పసిఫిక్ మహాసముద్రంలో నీటి అడుగున చీలిక సంభవించి పేలుడు, అగ్నిపర్వత విస్ఫోటనం జరిగి జపాన్‌లో ఓ భారీ సునామీ సంభవిస్తుందని.. దీంతో జపాన్ నగరాలు మునిగిపోతాయని ఆమె పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో జపాన్ లో ఏర్పడే ప్రళయం 2011లో ఈశాన్య జపాన్‌ను నాశనం చేసిన సునామీ కంటే భారీగా ఉంటుందని.. జపాన్‌ దక్షిణ తీరంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. అయితే అప్పుడు సంభవించిన భారీ భూకంపం, సునామీని కూడా రియో ముందుగానే ఊహించి హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే జపాన్, ఫిలిప్పీన్స్‌ మధ్య సముద్రం మరుగుతున్నదని… భారీ బుడగలు ఏర్పడుతున్నాయని తన పుస్తకంలో పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు ఈ అంచనాలకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని.. ఇటువంటి వార్తలను నమ్మవద్దు అంటూ చెబుతున్నారు.. అయినా సరే టాట్సుకీ అంచనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పర్యాటకులు, జపనీయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. జపాన్ వాతావరణ సంస్థ ఈ పెరుగుతున్న ఆందోళనను అధికారికంగా ప్రస్తావించింది. ఈ అంచనాను “నమ్మశక్యం కానిది” అని పేర్కొంది. భవిష్యత్తులో భూకంపాలు సంభవించే ఖచ్చితమైన తేదీ, సమయం లేదా స్థానాన్ని ప్రస్తుత శాస్త్రీయ పద్ధతి ఏదీ నిర్ణయించలేదని ఆ సంస్థ పునరుద్ఘాటించింది.

అయితే మరోవైపు టాట్సుకి అంచనాలను బలంగా విశ్వసించే పర్యాటకులు జపాన్‌కు వెళ్లేందుకు బయపడుతున్నారు. ఆ దేశానికి వెళ్ళే విమాన బుకింగ్‌లు భారీగా రద్దయ్యాయి. ఎంతగా అంటే జూన్‌ చివరి, జూలై తొలి వారాల్లో హాంకాంగ్ నుంచి జపాన్‌కు విమాన రిజర్వేషన్లు 83 శాతం పడిపోవడంతో ఆ దేశ పర్యాటక రంగం కుదేలు అయింది. దీంతో జపాన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అయితే రియో ఆ దేశం గురించి వేసిన అంచనాలతో అక్కడ సునామీ బీభత్సం సృష్టించినా సృష్టించక పోయినా.. ఆమె చెప్పిన భవిష్యత్ ఇప్పుడు ఆ దేశ పర్యాటక రంగంపై మాత్రమే కాదు ఆర్ధిక పరిస్థితిపై కూడా భారీ ప్రభావాన్ని చూపిస్తుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..