Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dalai Lama: దలైలామా పునర్జన్మను ఎలా నిర్ణయిస్తారు? దలైలామా ఒక పేరా లేక బిరుదా? ఈ స్థానం ఎందుకు ముఖ్యం అంటే.

గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ కొత్త దలైలామా పునర్జన్మను ఎంపిక చేస్తుంది. ఈ విషయాన్నీ టిబెటన్ బౌద్ధ మత నాయకుడు దలైలామా ప్రకటించారు. అయితే అసలు దలైలామాను ఎలా ఎంపిక చేస్తారు. అసలు దలైలామా తన మరణం తర్వాత అతని వారసుడు ఎవరు? అతను ఎలా ఎంపిక చేయబడతాడు పుట్టిన బిడ్డను దలైలామా పునర్జన్మగా ఎలా నిర్ణయిస్తారు? అసలు దలైలామా పేరా? బిరుదా తెలుసుకోండి..

Dalai Lama: దలైలామా పునర్జన్మను ఎలా నిర్ణయిస్తారు? దలైలామా ఒక పేరా లేక బిరుదా? ఈ స్థానం ఎందుకు ముఖ్యం అంటే.
Dalai Lama Selection Proces
Surya Kala
|

Updated on: Jul 03, 2025 | 1:48 PM

Share

టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా తదుపరి దలైలామాను 600 ఏళ్ల నాటి సంస్థ ఎంపిక చేస్తుందని స్పష్టం చేశారు. అంటే 15వ దలైలామాను గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ ఎంపిక చేస్తుంది. అతని పునర్జన్మ గుర్తింపుపై కూడా నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం 14వ టిబెటన్ బౌద్ధ మత నాయకుడు దలైలామా జూలై 6న 90 ఏళ్లు నిండుతాయి. ఆ రోజున దలైలామా తన మరణం తర్వాత తన వారసుడు ఎవరు? అతను ఎలా ఎంపిక చేయబడతాడో మెక్లియోడ్‌గంజ్‌లోని తన నివాసం నుంచి ప్రకటించనున్నారు.

చైనా జోక్యాన్ని నివారించడానికి దలైలామా సంప్రదాయాన్ని మార్చుకుని తన వారసుడిని ముందుగానే ప్రకటిస్తుందని నమ్ముతున్నారు. దలైలామా తన 90వ పుట్టినరోజుకు ముందు విడుదల చేసిన ఈ ప్రకటన చైనాకు ఒక పెద్ద సందేశం. చైనా దలైలామాను తిరుగుబాటుదారుడిగా పిలుస్తుంది. లాసాలో చైనా పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు తర్వాత దలైలామా 1959లో భారతదేశానికి వచ్చారు. ఆయన వేలాది మంది టిబెటన్లతో ప్రవాసంలో నివసిస్తున్నారు. చైనా కూడా ఆయనను వేర్పాటువాదిగా పిలుస్తుంది. అయితే.. ఈ మొత్తం విషయంపై, తదుపరి ప్రకటన కోసం చైనా తన ఆమోదం తీసుకోవడం తప్పనిసరి అని చెబుతోంది. దలైలామాను ఎలా ఎంచుకుంటారు? పునర్జన్మ తర్వాత దలైలామా అవతారం ఎవరు అనేది ఎలా నిర్ణయించబడుతుందో ఈ రోజు తెలుసుకుందాం.

దలైలామా అనేది ఒక పేరా లేక బిరుదా? దలైలామా అనేది ఒక పేరు కాదు. ఇది ఒక మతపరమైన బిరుదు. ప్రస్తుతం 14వ దలైలామా ఉన్నారు. అతని అసలు పేరు టెన్జిన్ గయాట్సో. సంప్రదాయాల ప్రకారం టిబెటన్ అత్యున్నత మత నాయకుడిని దలైలామా అని పిలుస్తారు. ఈ పదం ప్రజాదరణ పొందడానికి ఇదే కారణం. ఇప్పుడు 15వ దలైలామా గురించి ఒక ప్రకటన జారీ చేయబడింది. ప్రస్తుత దలైలామా టెన్జిన్ గయాట్సోను 2 సంవత్సరాల వయస్సులో తదుపరి దలైలామాగా గుర్తించారు. 4 సంవత్సరాల వయస్సులో లాసాకు తీసుకురాబడ్డారు.

ఇవి కూడా చదవండి

తదుపరి దలైలామాను ఎలా ఎంపిక చేస్తారు? దలైలామాను ఆధ్యాత్మిక ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ టిబెటన్ బౌద్ధమతం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. టిబెటన్ బౌద్ధమతంలో దలైలామా పునర్జన్మ పొందుతారని నమ్ముతారు. దలైలామా మరణించినప్పుడు..అతను పిల్లవాడిగా జన్మించాడని నమ్ముతారు. దీని తరువాత ఆ పిల్లాడిని కనుగొనడానికి సన్నాహాలు ప్రారంభిస్తారు.

పునర్జన్మ తర్వాత ఏ బిడ్డ దలైలామా అవుతాడనేది బహుళ దశల ప్రక్రియ తర్వాత నిర్ణయించబడుతుంది. ఉదాహరణకు దలైలామా పునర్జన్మ ప్రవచనం ఆధారంగా కనుగొనబడుతుంది. దీని కోసం దివంగత దలైలామా చివరి క్షణాల సంకేతాలు, మృతదేహం దిశ, అతని కలలు, పవిత్ర సరస్సులో కనిపించే ఏదైనా ప్రత్యేక దర్శనం.. వీటి ఆధారంగా.. దలైలామ పునర్జన్మని కనుగొంటారు.

దలైలామా అవతారాన్ని ఎలా నిర్ణయిస్తారు? దలైలామా అవతారాన్ని గుర్తించిన తర్వాత అతనికి మునుపటి దలైలామా విషయాలు చూపించబడతాయి. అతను ఆ విషయాలను గుర్తించగలడా లేదా అనేది తెలుసుకుంటారు. అతను వాటిని గుర్తిస్తే.. అతన్ని గురువు పునర్జన్మగా పరిగణిస్తారు. దీని తరువాత టిబెటన్ మత అధికారుల నుంచి నిర్ధారణ తర్వాత తదుపరి దలైలామాను ప్రకటిస్తారు.

దలైలామా అధికారిక ప్రకటన తర్వాత ఆ శిశువుకి బౌద్ధమత బోధనలు ఇవ్వబడతాయి. అతనికి మతపరమైన దీక్ష ఇవ్వబడుతుంది. ఆ ప్రాంత సంప్రదాయాలలో భాగం చేయబడుతుంది. ఈ విధంగా కొత్త దలైలామా విద్య, దీక్ష జరుగుతుంది.

దలైలామా స్థానం ఎందుకు ముఖ్యమైనది? దలైలామా టిబెటన్ బౌద్ధుల ఆధ్యాత్మిక అధిపతి. ఆయన జీవితం దయ, కరుణ, అహింస, జ్ఞానం ఆదర్శాలపై ఆధారపడి ఉంటుంది. బౌద్ధమతాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఆయనను టిబెటన్ గుర్తింపు, సంస్కృతి రక్షకుడిగా కూడా పిలుస్తారు. దలైలామా టిబెటన్ ప్రజల ఆశలను, ముఖ్యంగా ప్రవాసంలో నివసిస్తున్న వారి ఆశలను సూచిస్తారు. 1959 వరకు దలైలామా మతం, రాజకీయాలు రెండింటికీ అధిపతిగా ఉండేవారు. ప్రస్తుతం 14వ దలైలామా రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారు. ప్రత్యేకత ఏమిటంటే బౌద్ధ మత గురువు అయినప్పటికీ ఆయన సందేశాలు, బోధనలు అన్ని మతాలు, సంస్కృతులకు స్ఫూర్తిదాయకంగా ఉండడం విశేషం.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..