Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘనాలో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం.. దేశ అత్యున్నత పురస్కారంతో జాతీయ సత్కారం

రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ బుధవారం(జూలై 03) ఘనా చేరుకున్నారు. అక్కడ ఘనా అధ్యక్షుడు జాన్ డ్రామాని మహామా విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘనా స్వాగతం పలికారు. మూడు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఒకరు ఘనాను సందర్శించడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది.

ఘనాలో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం.. దేశ అత్యున్నత పురస్కారంతో జాతీయ సత్కారం
Pm Modi
Balaraju Goud
|

Updated on: Jul 03, 2025 | 7:30 AM

Share

మూడు దశాబ్దాల తర్వాత ఘనాను సందర్శించిన తొలి భారత ప్రధానిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. రాజధాని అక్రాలోని ఒక హోటల్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఘనా పిల్లల బృందం తమ చేతుల్లో భారతీయ, ఘనా జెండాలను పట్టుకుని “హరే రామ హరే కృష్ణ” నినాదాలతో హృదయపూర్వకంగా స్వాగతిస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. భారతీయ ప్రవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటనలో ఘనా మొదటి దశ.

రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ బుధవారం(జూలై 03) ఘనా చేరుకున్నారు. అక్కడ ఘనా అధ్యక్షుడు జాన్ డ్రామాని మహామా విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘనా స్వాగతం పలికారు. మూడు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఒకరు ఘనాను సందర్శించడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆయనకు గార్డ్ ఆఫ్ హానర్‌తో పాటు 21-గన్ సెల్యూట్ ఇచ్చారు. ఘనాలో ప్రధాని మోదీకి ‘ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ అవార్డుతో ఘనా ప్రభుత్వం ఘనంగా సత్కరించింది.

రాజధాని అక్రాలో జరిగిన ఒక కార్యక్రమంలో, అధ్యక్షుడు మహామా ప్రధాని మోదీని ఘనా అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’తో సత్కరించారు. ప్రధాని మోదీ ఈ గౌరవాన్ని భారత పౌరులకు అంకితం చేశారు. ఈ గౌరవానికి ఘనాకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఘనా అత్యున్నత పురస్కారం దక్కడం చాలా గర్వకారణం, గౌరవం. అధ్యక్షుడు మహామా, ఘనా ప్రభుత్వం, ఘనా ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 1.4 బిలియన్ల భారతీయుల తరపున నేను ఈ గౌరవాన్ని వినయంగా అంగీకరిస్తున్నాను. ఈ అవార్డును మన యువత ఆకాంక్షలకు, వారి ఉజ్వల భవిష్యత్తుకు, మన గొప్ప సాంస్కృతిక వైవిధ్యం, సంప్రదాయాలకు, భారతదేశం, ఘనా మధ్య చారిత్రక సంబంధాలకు అంకితం చేస్తున్నాను’ అని అన్నారు.

అంతకుముందు, ప్రధాని మోదీ ఘనా అధ్యక్షుడు జాన్ డ్రామానీ మహామాతో సమావేశం నిర్వహించారు. చర్చల తర్వాత, భారత్-ఘనా అధికారులు రెండు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలపై సంతకం చేశారు. ఈ సందర్భంగా, అధ్యక్షుడు మహామా, ప్రధాని మోదీ భారత్-ఘనా మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని విస్తరించాలని నిర్ణయించారు. “పెట్టుబడి, ఇంధనం, ఆరోగ్యం, భద్రత, అభివృద్ధి భాగస్వామ్యంలో సహకారానికి కొత్త మార్గాలను తెరవాలని ఎదురు చూస్తున్నాను” అని ప్రధాని మోదీ తెలిపారు. రెండు దేశాలు శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలు, ఘనా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించడం గొప్ప గౌరవంగా భావిస్తానని ప్రధాని అన్నారు.

పశ్చిమ ఆఫ్రికా దేశమైన ఘనాలో 15,000 మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారు. కొన్ని కుటుంబాలు 7 దశాబ్దాలకు పైగా అక్కడ నివసిస్తున్నాయి. చాలా మంది ఇప్పుడు వారి నాల్గవ తరంలో ఉన్నారు. కొందరు ఘనా పౌరసత్వాన్ని కూడా పొందారు. ఘనా నుండి, ప్రధాని మోదీ తన బహుళ దేశాల పర్యటనను కొనసాగిస్తూ, భారతదేశం ప్రపంచ దౌత్య సంబంధాలు బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా ట్రినిడాడ్, టొబాగో (జూలై 3–4), అర్జెంటీనా (జూలై 4–5), 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి బ్రెజిల్, నమీబియాలలో పర్యటిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

15 సిక్సర్లతో 34 ఏళ్ల వరల్డ్ రికార్డు బ్రేక్..
15 సిక్సర్లతో 34 ఏళ్ల వరల్డ్ రికార్డు బ్రేక్..
వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్‌.. ఎందుకో తెలుసా..?
వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్‌.. ఎందుకో తెలుసా..?
ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన హీరో..
ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన హీరో..
ఆలుతో అందం..చర్మానికి బంగాళదుంప రసం ఎలా ఉపయోగపడుతుందో తెలిస్తే..
ఆలుతో అందం..చర్మానికి బంగాళదుంప రసం ఎలా ఉపయోగపడుతుందో తెలిస్తే..
చిక్‌బళ్లాపూర్ ఘటనకు విరాట్ కోహ్లీ వీడియో కారణమా?
చిక్‌బళ్లాపూర్ ఘటనకు విరాట్ కోహ్లీ వీడియో కారణమా?
మూడు గ్రహాలతో చంద్రుడు యుతి.. ఈ రాశుల వారికి అంతా శుభ యోగాలే..!
మూడు గ్రహాలతో చంద్రుడు యుతి.. ఈ రాశుల వారికి అంతా శుభ యోగాలే..!
హెచ్‌సీఏ కేసులో ఈడీ దూకుడు.. ఐదుగురిపై ఈసీఐఆర్ నమోదు..
హెచ్‌సీఏ కేసులో ఈడీ దూకుడు.. ఐదుగురిపై ఈసీఐఆర్ నమోదు..
రోజూ రెండు లవంగాలు తింటే ఏమౌతుందో తెలుసా..? లాభాలు తెలిస్తే..
రోజూ రెండు లవంగాలు తింటే ఏమౌతుందో తెలుసా..? లాభాలు తెలిస్తే..
మెగా కోడలి గొప్ప మనసు.. 150 అనాథాశ్రమాలను దత్తత తీసుకున్న ఉపాసన
మెగా కోడలి గొప్ప మనసు.. 150 అనాథాశ్రమాలను దత్తత తీసుకున్న ఉపాసన
విద్యుత్‌ మీటర్‌ ఏర్పాటు చేసిన ఒక రోజులోనే రూ.1.70 లక్షల బిల్లు
విద్యుత్‌ మీటర్‌ ఏర్పాటు చేసిన ఒక రోజులోనే రూ.1.70 లక్షల బిల్లు