Feng Shui Tips: బయట తిరిగిన చెప్పులు, బూట్లతో ఇంట్లోకి ప్రవేశించడం మంచిదేనా.. తెలుసుకోండి..
వాస్తు శాస్త్రం వలనే ఫెంగ్ షుయ్ కూడా ఇంటికి సంబంధించిన అనేక విషయాలను తెలియజేస్తుంది. ఫెంగ్ షుయ్ చిట్కాలను అనుసరించడం వలన శుభప్రదంగా భావించే అనేక విషయాలు ఉన్నాయి. ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు మనం గుర్తుంచుకోవలసిన విషయాలను తెలుసుకుందాం. ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లోకి ప్రవేశించే ముందు బూట్లు తీయాలా వద్దా.. కారణం ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

ఫెంగ్ షుయ్ చిట్కాలు చైనీస్ మత గ్రంథం ‘తయో’ ఆధారంగా రూపొందించబడ్డాయి. ఫెంగ్ షుయ్ చిట్కాల ప్రకారం ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు బూట్లు, చెప్పులను ఇంటి వెలుపల విడిచిపెట్టాలి. ఫెంగ్ షుయ్ ప్రకారం బూట్లు, చెప్పులను ఇంటి లోపలకి తీసుకెళ్లడం నిషేధించబడింది. ఇంటికి సంబంధించిన అనేక విషయాలు ఫెంగ్ షుయ్ లో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇంటి లోపల బూట్లు, చెప్పులు ధరించకపోవడానికి కారణం ఏమిటో తెలుసుకుందాం..
పగలు చెప్పులు, బూట్లు ధరించి బయట తిరగడం వలన బూట్లతో పాటు దుమ్ము, ధూళి, ప్రతికూల శక్తి కూడా వస్తాయి. అందుకే బూట్లు, చెప్పులు ధరించి బయట తిరిగి ఆ బూట్లతో ఇంట్లోకి ప్రవేశిస్తే.. ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇది ఇంటి వాతావరణాన్ని పాడు చేస్తుంది. ఇంట్లో ఉద్రిక్తత, మానసిక ఒత్తిడిని పెంచుతుంది. అందుకే ఇంట్లోకి ప్రవేశించే ముందు బూట్లు, చెప్పులు తీసివేయాలి.
ఇంటి లోపల బూట్లు ధరించడం వల్ల బయటి నుంచి క్రిములు ఇంట్లోకి వస్తాయి. దీనివల్ల అనేక వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది. అందుకే బయట తిరిగిన బూట్లను ఇంట్లోకి తీసుకురాకూడదు.
స్వచ్ఛతను కాపాడుకోవడానికి
ఇంటి లోపల వాతావరణం చాలా ప్రశాంతంగా, భిన్నంగా ఉంటుంది. అందుకే ఇంటి వాతావరణాన్ని స్వచ్ఛంగా , పవిత్రంగా ఉంచడానికి దానిని ప్రతికూల శక్తి నుంచి రక్షించాలి. దీని కోసం బయటి నుంచి కలుషితమైన గాలి, ధూళిని ఇంటి లోపలికి తీసుకురాకూడదు.
ఫెంగ్ షుయ్ చిట్కాల ప్రకారం ఇంటి లోపల, వెలుపల ఉపయోగించే బూట్లు వేరుగా ఉంచాలి. ఇంట్లోకి ప్రవేశించే ముందు బయట ఉపయోగించే బూట్లు, చెప్పులు తీసివేయాలి. ఇంటి లోపల ఉపయోగించే బూట్లు , చెప్పులు ఇంటి లోపల మాత్రమే ధరించాలి. వాటిని ఇంటి వెలుపల తీసుకురావద్దు.
ఫెంగ్ షుయ్ మాత్రమే కాదు హిందూ ధర్మంలో, వాస్తు శాస్త్రంలో కూడా ఇంటి బయట తిరిగిన బూట్లు , చెప్పులతో ఇంట్లోకి వెళ్ళడం శుభప్రదం కాదని పేర్కొన్నాయి. ఇంటి బయట బూట్లను తీయడం గౌరవం, వినయానికి చిహ్నంగా పరిగణించబడుతుందని అనేక సంస్కృతులలో కూడా చెప్పబడింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.