Viral Video: హ్యాండ్‌బ్యాగ్ లంటే ఇష్టమా.. ఈ ఆటో రిక్షా హ్యాండ్ బ్యాగ్ పై ఓ లుక్ వేయండి.. దీని స్పెషాలిటీ ఏమిటంటే..
లూయిస్ విట్టన్ ప్రపంచ లగ్జరీ బ్రాండ్‌లలో ఒకటి. ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ఫ్యాషన్ ప్రాజెక్ట్‌తో మళ్ళీ వార్తల్లో నిలిచింది. అవును లూయిస్ విట్టన్ భారతీయ ఆటో రిక్షా థీమ్‌తో కొత్త హ్యాండ్‌బ్యాగ్‌ను ప్రవేశపెట్టింది. ఫ్యాషన్, సంస్కృతి ఈ ప్రత్యేకమైన కలయికను చూసిన తర్వాత ఫ్యాషన్ ప్రియులను అమితంగా ఆకర్షిస్తుంది.

మహిళలకు హ్యాండ్‌బ్యాగులు అంటే చాలా ఇష్టం. చాలా మందికి ముఖ్యంగా సంపన్న మహిళలకు అయితే లూయిస్ విట్టన్ వంటి లగ్జరీ బ్యాగులంటే ప్రాణం. లక్షల రూపాయలు చెల్లించి ఈ బ్రాండెడ్ బ్యాగులను కొనుగోలు చేసే వ్యక్తులు ఉన్నారు. ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ అయిన లూయిస్ విట్టన్ దాని ప్రత్యేకమైన బ్యాగులకు ప్రసిద్ధి చెందింది. గతంలో ఈ బ్రాండ్ ప్రపంచంలోనే అతి చిన్న మైక్రోస్కోపిక్ హ్యాండ్‌బ్యాగ్‌ను తయారు చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది. ఇప్పుడు LV భారతీయ ఆటో రిక్షా థీమ్‌తో విభిన్నమైన హ్యాండ్‌బ్యాగ్‌ను ప్రవేశపెట్టింది. నిజమైన ఆటోగా కనిపించే ఈ చిన్న ఆటో రిక్షా లాగా కనిపించే ఈ బ్యాగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆటో రిక్షా థీమ్ బ్యాగ్ లూయిస్ విట్టన్ బ్రాండ్ గతంలో ప్రపంచంలోనే అతి చిన్న హ్యాండ్‌బ్యాగ్‌ను తయారు చేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఈ లగ్జరీ కంపెనీ భారతీయ ఆటో రిక్షా నేపథ్య బ్యాగ్‌ను తయారు చేసి వార్తల్లో నిలిచింది. ఫ్యాషన్, సంస్కృతి ఈ ప్రత్యేకమైన కలయికతో ఫ్యాషన్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
ఈ బ్యాగ్ ప్రత్యేకత ఏమిటి? లూయిస్ విట్టన్ డిజైనర్లు ఈ కొత్త బ్యాగ్‌ను ఆటో రిక్షా థీమ్‌తో రూపొందించారు. ఇందులో LV సిగ్నేచర్ క్లాసిక్ బ్రౌన్, గోల్డెన్ మోనోగ్రామ్ ప్రింట్ ఉన్నాయి.
వైరల్ వీడియోను ఇక్కడ చూడండి:
View this post on Instagram
దీనికి సంబంధించిన వీడియోను diet_paratha అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న వీడియోలో మూడు చక్రాలు కలిగిన రిక్షా-నేపథ్య హ్యాండ్‌బ్యాగ్‌ను చూడవచ్చు. ఫ్యాషన్ ప్రియులు ఈ ప్రత్యేకమైన హ్యాండ్‌బ్యాగ్‌తో పూర్తిగా ప్రేమలో పడ్డారు.
వారం క్రితం షేర్ చేయబడిన ఈ వీడియో 1.6 మిలియన్ల వ్యూస్ తో పాటు రకరకాల కామెంట్స్ ను సొంతం చేసుకుంది. ఒకరు ఇటీవల ప్రాడా బ్రాండ్ దాని కొల్హాపురి చెప్పులతో వార్తల్లో నిలిచింది. ఇప్పుడు LV ఒక ఆటోను తయారు చేసి నెటిజన్లను ఆకర్షిస్తోంది అని చమత్కరించారు. మరొకరు దీనిని కొనే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా?” అని అడిగారు. అంతేకాదు ఈ బ్యాగ్ ఆటో కంటే ఖరీదైనది” అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..