పసివాడి ప్రాణం తీసిన కూల్ డ్రింక్.. తీవ్ర గర్భశోకం మిగిల్చిన బాలుడి మృతి!
కూల్ డ్రింక్ సీసా కనిపించగానే.. కూల్ డ్రింక్ అనుకుని వెంటనే తాగాడు. అయితే అదే బాలుడు పాలిట యమపాశం అయ్యింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరక గూడెం మండలం చొప్పల గ్రామంలో విషాదం నెలకొంది. శీతలపానీయం అనుకుని గడ్డి మందు తాగి బాలుడు మృతి చెందాడు. స్థానికులను ఈ విషాద ఘటన కలచి వేసింది.

కూల్ డ్రింక్ సీసా కనిపించగానే.. కూల్ డ్రింక్ అనుకుని వెంటనే తాగాడు. అయితే అదే బాలుడు పాలిట యమపాశం అయ్యింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరక గూడెం మండలం చొప్పల గ్రామంలో విషాదం నెలకొంది. శీతలపానీయం అనుకుని గడ్డి మందు తాగి బాలుడు మృతి చెందాడు. జాడి నవీన్, వరలక్ష్మి దంపతుల రెండో సంతానం వరుణ్ తేజ్ (5) గత జూన్ నెల 29వ తేదీన ఇంట్లో ఆడుకుంటూ.. కూల్ డ్రింక్ అనుకుని గడ్డిమందు తాగాడు. అది గమనించిన వెంటనే తల్లిదండ్రులు చిన్నారిని స్థానిక హాస్పిటల్ కి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం.. ఆ తర్వాత హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్‌కు తరలించారు.
ఆపస్మారకస్థితిక చేరిన బాలుడిని కాపాడుకునేందుకు ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారకు. బాలుడు చికిత్స కోసం పలువురు దాతలు ఆర్థిక సహాయం అందించారు. అయినా బాలుడు ప్రాణం దక్కలేదు. ఆరు రోజుల పాటు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచాడు. తోటి పిల్లలతో సరదాగా ఆడుతూ పాడుతూ అల్లరి చేసే తమ చిన్నారి.. ఈ విధంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు గా విలపిస్తున్నారు. స్థానికులను ఈ విషాద ఘటన కలచి వేసింది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..