AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRTC Bus: సంక్రాంతికి అందుబాటులో కొత్త బస్సులు.. మహిళలకు అక్కడి వరకే ఉచిత ప్రయాణం..

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు ప్రత్యేకత ఉంది. ఏ పండుగకు వెళ్లని వారు తమ సొంత ఊళ్లకు వెళ్లి రెండు రోజులు కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు ఆసక్తిచూపుతారు. సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.

TSRTC Bus: సంక్రాంతికి అందుబాటులో కొత్త బస్సులు.. మహిళలకు అక్కడి వరకే ఉచిత ప్రయాణం..
Tsrtc Bus
Srikar T
|

Updated on: Jan 05, 2024 | 6:00 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు ప్రత్యేకత ఉంది. ఏ పండుగకు వెళ్లని వారు తమ సొంత ఊళ్లకు వెళ్లి రెండు రోజులు కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు ఆసక్తిచూపుతారు. సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ బస్సులను జనవరి 6 నుండి 15 వరకు హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు.

అలాగే ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకుల కోసం పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు కూడా అధిక సంఖ్యలో సర్వీసులు నడపాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెబుతూనే.. రాష్ట్ర సరిహద్దుల వరకు మాత్రమే ఈ సర్వీసులు వర్తిస్తాయని తెలిపారు. సంక్రాంతికి ప్రతి ఒక్కరినీ సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఛార్జీల్లో ఎలాంటి పెరుగుదల లేకుండా సాధారణ ఛార్జీలతో ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని చెప్పారు.

ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్‌బి నగర్, ఆరామ్‌ఘర్, కెపిహెచ్‌బి లలోప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అలాంటి బస్ స్టాపుల్లో బస్సులు ఎక్కేందుకు వేచి ఉన్న ప్రయాణికుల కోసం టిఎస్‌ఆర్‌టిసి అధికారులు ప్రత్యేక శిబిరాలను కూడా ఏర్పాటు చేశారని వివరించారు. తాగునీరు, మొబైల్ బయో-టాయిలెట్లు అవసరమైన ప్రదేశాలలో ప్రయాణీకుల సౌకర్యం ఏర్పాటు చేశామని వాటిని వినియోగించుకోవాలని కోరారు.

ఇవి కూడా చదవండి

బస్‌భవన్‌, ఎంజీబీఎస్‎లలో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ల ద్వారా రద్దీ ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. టోల్ ప్లాజాల వద్ద టిఎస్‌ఆర్‌టిసి బస్సుల కోసం ప్రత్యేక లేన్‌లను ఏర్పాటు చేశారు. తద్వారా ప్రజలు తమ గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చని పేర్కొన్నారు. పౌరులు ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించాలని, అధిక ఛార్జీలు చెల్లించి ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణించవద్దని సజ్జనార్ ప్రజలను కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..