Free Bus Effect: తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్ ఎఫెక్ట్.. ఆటో డ్రైవర్ వినూత్న నిరసన వైరల్..
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి వ్యతిరేకంగా ఆటో డ్రైవర్లు నిరసన చేస్తున్నారు. అయితే ఇలాంటి తరుణంలో సరికొత్త పద్దతిలో తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు కొందరు ఆటో డ్రైవర్లు. బస్సులను ఎక్కి ప్రయాణికుల నుండి భిక్షాటన చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
![Free Bus Effect: తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్ ఎఫెక్ట్.. ఆటో డ్రైవర్ వినూత్న నిరసన వైరల్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/01/telangana-auto-drivers.jpg?w=1280)
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి వ్యతిరేకంగా ఆటో డ్రైవర్లు నిరసన చేస్తున్నారు. అయితే ఇలాంటి తరుణంలో సరికొత్త పద్దతిలో తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు కొందరు ఆటో డ్రైవర్లు. బస్సులను ఎక్కి ప్రయాణికుల నుండి భిక్షాటన చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణ ప్రభుత్వ మహాలక్ష్మి పథకానికి వ్యతిరేకంగా ఆటో డ్రైవర్లు తమ యూనిఫాం ధరించి బస్సులో ప్రయాణీకుల నుండి గిన్నె పట్టుకుని భిక్ష కోరడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిర్దేశిత టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రకటించింది. ఈ పథకం కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానంలో ఒకటి. అందుకే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే అమలు చేస్తూ ముందుకు సాగుతోంది.
మహాధర్నాకు ఆటో డ్రైవర్ల యూనియన్ పిలుపు
రాష్ట్రంలోని ప్రతి ఆటో యూనియన్ జనవరి 7, ఆదివారం నాడు మహాధర్నాకు పిలుపునిచ్చింది. భారతీయ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (BRTU) అనుబంధంగా ఈ ధర్నా జరుగనుంది. తెలంగాణ అటానమస్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ జనవరి 7న ధర్నా చౌక్, ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేయనున్నట్లు ప్రకటించింది. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి వ్యతిరేకంగా కనీసం 1000 మంది ఆటో డ్రైవర్లు నిరసన తెలపాలని భావిస్తున్నారు. భారతీయ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (BRTU) రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి గతంలో రాష్ట్రాన్ని పాలించిన భారత రాష్ట్ర సమితితో అనుబంధం కలిగి ఉంది.
తెలంగాణ ప్రభుత్వం ఆటో రిక్షా డ్రైవర్లతో సహా గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికులకు రూ. 5 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల ఆరోగ్య బీమాను ప్రకటించింది. అయితే మహిళలకు టిఎస్‌ఆర్‌టిసి బస్సులలో ఉచిత ప్రయాణం తమపై తీవ్ర ప్రభావం చూపిందని ఆటో కార్మికులు నిరాశ వ్యక్తం చేశారు. తమ ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వర్కింగ్ ఉమెన్స్ ఇప్పుడు వందల రూపాయలు ఖర్చు చేసి ఆటోరిక్షాల్లో ప్రయాణించడం లేదని తెలిపారు. ప్రభుత్వం ఉచితంగా అందించిన బస్సులో ప్రయాణించేందుకు ఆసక్తిచూపుతున్నారని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు.
బిక్షం అడుక్కుంటూ ఆటో డ్రైవర్ల నిరసన
మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణంతో ఆటో డ్రైవర్ల బ్రతుకుతెరువు కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, మేడ్చల్‌లో ఆటో డ్రైవర్లు బిక్షం అడుక్కుంటూ నిరసన తెలిపారు. pic.twitter.com/eWcPnALvny
— Telugu Scribe (@TeluguScribe) January 4, 2024
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..