TSPSC Paper Leak Case: విదేశాల నుంచి వచ్చి పరీక్ష రాసిందెవరు..? కీలక వివరాలు సేకరించిన ఈడీ..

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయన్న అనుమానంతో రంగంలోకి దిగిన ఈడీ.. కోర్టు అనుమతితో నిందితులను రెండు రోజులు విచారించింది. ఈ క్రమంలోనే ప్రధాన నిందితులైన ప్రవీణ్‌, రాజశేఖర్‌లను పలు ప్రశ్నలు అడిగారు.

TSPSC Paper Leak Case: విదేశాల నుంచి వచ్చి పరీక్ష రాసిందెవరు..? కీలక వివరాలు సేకరించిన ఈడీ..
TSPSC
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 19, 2023 | 9:08 AM

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయన్న అనుమానంతో రంగంలోకి దిగిన ఈడీ.. కోర్టు అనుమతితో నిందితులను రెండు రోజులు విచారించింది. ఈ క్రమంలోనే ప్రధాన నిందితులైన ప్రవీణ్‌, రాజశేఖర్‌లను పలు ప్రశ్నలు అడిగారు. సోమవారం చంచల్‌గూడ జైల్లో దాదాపు ఐదు గంటల పాటు నిందితులపై ప్రశ్నల వర్షం కురిపించిన అధికారులు.. ఎక్కువగా నిధుల మళ్లింపునకు సంబంధించిన వివరాలే అడిగినట్లు తెలుస్తోంది. మంగళవారం మరోమారు విచారించిన అధికారులు.. నిధుల మళ్లింపునకు సంబంధించి మరింత సమాచారం రాబట్టారు. ప్రవీణ్‌, రాజశేఖర్‌ను ప్రశ్నించిన అధికారులు.. ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

విదేశాల నుంచి వచ్చి పరీక్ష రాసిన అభ్యర్థుల వివరాలు సేకరించిన ఈడీ.. నిందితుల వాగ్మూలాన్ని నమోదు చేసింది. టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్సీలో ఎవరు.. ఎప్పుడు..ఎలా జాయిన్ అయ్యారనే వివరాలను సేకరించారు. ప్రవీణ్, రాజశేఖర్ లకు చెందిన బ్యాంక్ అకౌంట్స్ వివరాలను కూడానమోదు చేశారు. ప్రతి నెల ఎంత అమౌంట్ క్రెడిట్ అవుతుంది..? ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయనే కోణంలో అరా తీశారు. ప్రవీణ్ కు మొత్తం మూడు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ప్రవీణ్ కు చెందిన బ్యాంకు ఖాతాలకు సంబంధించి గత ఐదేళ్ల వివరాల గురించి తెలుసుకున్నారు. ప్రవీణ్, రాజశేఖర్ న్యాయవాదుల సమక్షంలోనే వారి స్టేట్ మెంట్ లపై సంతకాలు తీసుకున్నారు.

దాదాపు 7 గంటల పాటు ఇద్దరిని విచారించారు. ఈ ఇద్దరు ఇచ్చిన సమాచారంతో మరికొంత మందిని విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు.. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో సుమారు రూ.40 లక్షల వరకు డబ్బులు చేతులు మారి ఉండొచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం భావిస్తోంది. ఈ క్రమంలోనే లాగే కొద్దీ డొంక కదులుతోంది. రోజురోజుకూ కొత్త కొత్త నిందితులు తెరపైకి వస్తున్నారు. డీఏవో ప్రశ్నపత్రాన్ని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ దంపతులు రూ.10 లక్షలకు బేరం కుదుర్చుకుని కొనుగోలు చేసినట్లు ఇటీవల బయటపడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో