Ramappa Temple: ‘శిల్పం, వర్ణం, కృష్ణం’.. సప్తవర్ణాలతో రామప్ప దేవాలయంలో ప్రపంచ వారసత్వ వేడుకలు
తనివి తీరని అద్భుత కళాకృతులకు, కాకతీయ కట్టడాలకు ఓరుగల్లు కేంద్రమైతే.. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం.. ఇందుకు కేంద్ర బిందువు అని చెప్పాలి. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప.. ప్రపంచ వారసత్వ వేడుకులు ఘనంగా నిర్వహించారు. 'శిల్పం, వర్ణం, కృష్ణం' పేరుతో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి.
కాకతీయుల కళా వైభవం, శిల్పకళా సంపదకు నిలువెత్తు నిదర్శనం రామప్ప.. ఆ ఆలయం మిరుమిట్లు గొలిపే రంగురంగుల లేజర్ షోతో వెలిగిపోయింది. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప.. ప్రపంచ వారసత్వ వేడుకులు ఘనంగా నిర్వహించారు. తనివి తీరని అద్భుత కళాకృతులకు, కాకతీయ కట్టడాలకు ఓరుగల్లు కేంద్రమైతే.. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం.. ఇందుకు కేంద్ర బిందువు అని చెప్పాలి. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప.. ప్రపంచ వారసత్వ వేడుకులు ఘనంగా నిర్వహించారు. ‘శిల్పం, వర్ణం, కృష్ణం’ పేరుతో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌లతో పాటు పలువురు ముఖ్య అతిథులుగా పాల్గోన్నారు. ఈ వేడుకల్లో ప్రముఖ కళాకారులు పాల్గొని ప్రదర్శనలతో అలరిస్తున్నారు.
వేడుకల్లో భాగంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్, ప్రముఖ డ్రమ్స్ వాయిద్య కారుడు శివమణి, సింగర్ కార్తీక్, ప్లూటిస్ట్ నవీన్ తో పాటు 300 మంది కళాకారులతో ప్రదర్శనలు నిర్వహిస్తుండగా మంత్రి సత్యవతి రాథోడ్ సరదాగా డ్రమ్ వాయించారు. ప్రపంచవ్యాప్తంగా 255 కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీ పడగా రామప్ప కట్టడం యునెస్కో జాబితాలో చోటు సంపాదించుకోవడం భారతీయులందరికీ గర్వకారమన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..