Heatwave Alert: పవర్‌ఫుల్ సూరీడితో బీకేర్‌ఫుల్.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలెర్ట్..
Heat Wave Alert: సూర్యుడు ఉదయాన్నే మాడు పగులకొడుతున్నాడు.. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజులు ఎలా ఉంటాయోననే భయం జనాల్లో కలుగుతోంది. సాధారణ ఉష్ణోగ్రతలకంటే.. అన్ని చోట్ల అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Heat Wave Alert: సూర్యుడు ఉదయాన్నే మాడు పగులకొడుతున్నాడు.. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజులు ఎలా ఉంటాయోననే భయం జనాల్లో కలుగుతోంది. సాధారణ ఉష్ణోగ్రతలకంటే.. అన్ని చోట్ల అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత ఎండతో.. మధ్యాహ్నం వడగాలులతో బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు.. మరో రెండ్రోజులపాటు ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లండించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతేనే బయటకు వెళ్లాలంటూ అధికారులు సూచిస్తున్నారు. ఇంకా వడదెబ్బ తగలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం.. తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఏపీలో 98 మండలాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. అల్లూరి, అనకాపల్లి, తూ.గో, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, కడప జిల్లాల్లో వడగాల్పులకు అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు.
ఇక తెలంగాణలోనూ మాడుపగిలేలా ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో 44 డిగ్రీల కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలంతా ఎండదెబ్బ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దంటూ అధికారులు సూచిస్తున్నారు.
కాగా, పెరుగుతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..