AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: మీరు ఇళ్లను అద్దెకు ఇస్తున్నారా..? అయితే అడ్డంగా బుక్కవుతారు

పుష్ప సినిమా తరహాలో సీక్రెట్‌ చాంబర్లు, స్టోరేజ్‌లు ఏర్పాటు చేసుకుని గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు స్మగ్లర్లు. దీంతో పోలీసులు మరింత ఫోకస్ పెట్టి నేరగాళ్ల తిక్క కుదర్చుతున్నారు. దీంతో మత్తుగాళ్లు మరో కొత్త ఆలోచన షురూ చేశారు. ఇళ్లను అద్దెకు తీసుకుని గంజాయి దందా చేస్తున్నారు.

AP News: మీరు ఇళ్లను అద్దెకు ఇస్తున్నారా..? అయితే అడ్డంగా బుక్కవుతారు
Ganja In Home
Ram Naramaneni
|

Updated on: Apr 19, 2023 | 9:29 AM

Share

విశాఖలో ఇంటి ఓనర్లకు పోలీసుల హెచ్చరికలు జారీ చేశారు. ఇళ్లు అద్దెకు ఇచ్చే ముందు రెంట్‌కు తీసుకునే వ్యక్తుల పూర్తి వివరాలు తీసుకోవాలని సూచించారు. వస్త్ర వ్యాపారుల ముసుగులో ఇళ్లను నేరగాళ్లు అద్దెకు తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అద్దె ఇళ్లను గంజాయి డెన్‌లుగా మార్చేస్తూ కొత్త పంథాలో దందాలు చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ఇంకొందరు అయితే ఏకంగా ఇళ్లలోనే గంజాయి సాగు చేస్తున్నారు. వరుసగా వెలుగులోకి వస్తున్న ఘటనలతో అప్రమత్తమయ్యారు పోలీసులు. రూట్‌మార్చిన గంజాయి మాఫియాపై పోలీసుల స్పెషల్ ఫోకస్ పెట్టారు.  గంజాయి రవాణాకు వినియోగించే అద్దె భవనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అయితే ఇది కేవలం వైజాగ్‌లో ఉన్న సమస్య మాత్రమే కాదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో గంజాయి వినియోగం, రవాణా విపరీతంగా పెరిగింది. సిటీల్లో మాత్రమే కాదు.. పట్టణాల్లో, గ్రామాల్లో గంజాయి విపరీతంగా దొరుకుతుంది. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కొందరు ఇంటి పెరట్లోనే ఈ మత్తు మొక్కలను పెంచుతున్నారు.

గంజాయి రవాణాలో ఒడిశా నుంచి జరిగే స్మగ్లింగ్‌ మొత్తం విజయవాడ మీదుగానే సాగుతుంది. దీంతో విజయవాడ కేంద్రంగా గంజాయి రవాణా పై చాలా కాలంగా దృష్టి పెట్టారు ఏపీ పోలీసులు. అలాగే ఏజెన్సీ ప్రాంతం నుంచి నుంచి వచ్చే గంజాయి ఎన్ని మార్గాలలో వస్తున్నా… వేటాడి పట్టుకుంటున్నారు. బోర్డర్ చెక్ పోస్టుల దగ్గర ద్ద చెకింగ్ పైన దృష్టి పెట్టారు… ఎటు నుంచీ గంజాయి వచ్చినా సీజ్ చేస్తున్నారు.. పట్టుబడిన లక్షల కేజీల గంజాయి సీజ్ చేసి, దహనం చేస్తున్నారు.. ప్రస్తుతం ఆపరేషన్ పరివర్తన్ లో భాగంగా గంజాయి దహనం చేస్తున్నారు.

ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమంటున్నారు పోలీసులు. ‌ఏపీ వ్యాప్తంగా లక్షల కేజీల గంజాయి ధ్వంసం చేస్తున్న ఏపి పోలీసులు, ఎక్కడ గంజాయి కనిపించినా కఠినమైన చర్యలుంటాయంటున్నారు. దేశంలో చాలా చోట్లు పట్టుబడ్డ గంజాయి నిల్వలకు లింక్‌ ఆంధ్రా-ఒడిశా సరిహద్దు లోనే ఉంటుంది. అందుకే గట్టి నిఘా పెట్టిన పోలీసులు ఆ నెట్‌వర్క్‌ను చేధిస్తున్నారు. కొంతమంది అక్రమార్కులు కేసులు పెట్టి.. జైల్లకు పంపినా.. చిప్ప కూడు తిని వచ్చి మళ్లీ ఇదే దందా చేయడంతో పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరింత ఫోకస్ పెంచాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం  క్లిక్ చేయండి..

టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..