YS Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసు.. ఇవాళ సీబీఐ విచారణకు హాజరుకానున్న ఎంపీ అవినాష్‌రెడ్డి
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ క్రమంలో కొత్త వాదనలు.. సరికొత్త అంశాలు తెరమీదకు వస్తున్నాయి. కీలక దశకు చేరిన ఈ కేసులో ఇప్పటికే భాస్కర్ రెడ్డి అరెస్టు కాగా.. 25 వరకూ అవినాష్ రెడ్డికి ఆరెస్టు వద్దంటూ ముందస్తు బెయిలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ క్రమంలో కొత్త వాదనలు.. సరికొత్త అంశాలు తెరమీదకు వస్తున్నాయి. కీలక దశకు చేరిన ఈ కేసులో ఇప్పటికే భాస్కర్ రెడ్డి అరెస్టు కాగా.. 25 వరకూ అవినాష్ రెడ్డికి ఆరెస్టు వద్దంటూ ముందస్తు బెయిలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు. అయితే, విచారణ మాత్రం కంటిన్యూ చేయాలని సూచించింది. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి ఇవాళ ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకానున్నారు. అయితే, YS వివేకానందరెడ్డి హత్య జరిగి 4 ఏళ్లు గడిచాయి.! నాలుగేళ్ల కాలంలో ఈ కేసు దర్యాప్తులో లెక్కలేనన్ని ట్విస్టులు. సుప్రీం కూడా జోక్యం చేసుకోవడంతో విచారణను మరింత వేగవంతం చేసింది CBI. ఇన్వెస్టిగేషన్ తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో… ఆరోపణలు, ప్రత్యారోపణలు తారస్థాయికి చేరుకున్నాయి. అనేక కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. CBI విచారణ అంతా ఏకపక్షంగా జరుగుతోందని… రాజకీయకక్షలతో కుట్రపూరితంగా ఇరికిస్తున్నారన్నది ఎంపీ అవినాష్ వర్షన్. అసలు కేసుతో సంబంధం లేని తమ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేసి అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. CBI దర్యాప్తులో లోపాలు, పట్టించుకోని అంశాలు, సునీతారెడ్డి తీరుపై అనేక ప్రశ్నలు సంధించడమే కాదు.. మరెన్నో అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఎంపీ అవినాష్‌రెడ్డి. ఆయన సంధించిన టాప్-15 ప్రశ్నలేంటో ఓసారి చూద్దాం…
అవినాష్ ప్రశ్నలు ఇవే..
- వివేకా రాసిన లేఖను ఎందుకు దాచారు? దస్తగిరి బెయిల్‌ను ఎందుకు అడ్డుకోలేదు? దస్తగిరితో సునీత కలిసిపోవడం వెనుక ఉద్దేశం ఏంటి? డ్రైవర్ ప్రసాద్‌కు క్లీన్‌చిట్ ఎందుకు ఇచ్చారు? వివేకా రెండో పెళ్లి అంశం ఛార్జిషీట్‌లో ఎందుకు లేదు? వివేకా తన పేరును షేక్ మహ్మద్ అక్బర్‌గా మార్చుకోలేదా? వివేకా రాసిన వీలునామా సంగతి ఏంటి? ఆస్తిమొత్తం రెండో భార్య కుమారుడి పేరిట రాయలేదా? ఆ ఆస్తి కోసమే సునీత భర్త ఈ హత్య చేయించలేదా? వివేకా చెక్ పవర్‌ను రద్దు చేయడం నిజం కాదా? వివేకా వివాహేతర సంబంధాలను ఎందుకు ప్రశ్నించలేదు? గూగుల్ టేకవుట్ ఆధారాలకు ప్రామాణికం ఏంటి? టీడీపీ నేతల ప్రమేయంపై ఎందుకు ఫోకస్ చేయడం లేదు? వివేకా ఇంట్లో సీజ్ చేసిన దస్తావేజుల మాటేంటి? MP టికెట్‌పై వివాదమే లేదన్నది నిజం కాదా? అంటూ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.
వివేక రాసిన లేఖ చుట్టూ అనేక ప్రశ్నలు సంధిస్తోంది అవినాష్ కుటుంబం. హత్య జరిగిన వెంటనే..వివేకానందరెడ్డి మృతదేహం పక్కన దొరికిన లేఖను కొన్ని గంటల పాటు ఉద్దేశపూర్వకంగా సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి దాచిపెట్టారన్నది ప్రధాన ఆరోపణ. వివేక కుమార్తె సునీతారెడ్డి పదేపదే తన స్టాండ్‌ను ఎందుకు మారుస్తున్నారనేది మరో ప్రశ్న. అవినాష్ రెడ్డి కుటుబం లేదా ఇతరులు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నపుడు పదేపదే ఇంప్లీడ్ అవుతూ బెయిల్ ఇవ్వొద్దంటూ అడ్డుకుంటున్న సునీతారెడ్డి.. తానే హత్య చేశానని చెబుతున్న దస్తగిరికి బెయిల్ ఇస్తే ఎందుకు అడ్డుకోలేదని సూటిగా అడుగుతున్నారు అవినాష్.
రెండో భార్యకు మారుడు షేక్ షెహన్‌షా పేరు మీద తన ఆస్తి మొత్తాన్ని వివేకా వీలునామా రాసిన అంశం, ఈ ఇష్యూపై సునీత మొదటి నుంచి తండ్రిపై , అటు షమీమ్ పైనా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్న విషయంపై CBI ఎందుకు దృష్టిసారించడం లేదని ప్రశ్నిస్తున్నారు ఎంపీ అవినాష్. అలాగే వివేకా వివాహేతర సంబంధాలను ఛార్జిషీట్లలో ప్రస్తావించడం లేదన్నది ఆయన చేస్తున్న మరో ఆరోపణ.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..