Top Stars Campaign: తెలంగాణను రౌండప్ చేయనున్న అగ్రనేతలు.. మోదీ, అమిత్‌షా, రాహుల్, ప్రియాంక ప్రచారం

ఆఖరాటకు కౌంట్‌డౌన్ మొదలైంది. పోలింగ్ తేదీ దగ్గరపడ్డంతో టోటల్ తెలంగాణను రౌండప్ చెయ్యడానికి సిద్ధం అంటున్నారు జాతీయనేతలు. నాలుగురోజులు-నలుగురు టాప్‌ స్టార్స్.. తుది విడత ప్రచారాన్ని హోరెత్తించబోతున్నారు. ఎవరెవరు.. ఎక్కడెక్కడ టూరేస్తారు..? తెలంగాణ ప్రచారంలో వాళ్లిచ్చే ఫినిషింగ్ టచ్ ఎలా ఉండబోతోంది? తాయిలాలు ఏమైనా ప్రకటిస్తారా? అన్నదీ హాట్‌టాపిక్‌గా మారింది.

Top Stars Campaign: తెలంగాణను రౌండప్ చేయనున్న అగ్రనేతలు.. మోదీ, అమిత్‌షా, రాహుల్, ప్రియాంక ప్రచారం
Top Stars Campaigners
Follow us

|

Updated on: May 05, 2024 | 10:39 AM

ఆఖరాటకు కౌంట్‌డౌన్ మొదలైంది. పోలింగ్ తేదీ దగ్గరపడ్డంతో టోటల్ తెలంగాణను రౌండప్ చెయ్యడానికి సిద్ధం అంటున్నారు జాతీయనేతలు. నాలుగురోజులు-నలుగురు టాప్‌ స్టార్స్.. తుది విడత ప్రచారాన్ని హోరెత్తించబోతున్నారు. ఎవరెవరు.. ఎక్కడెక్కడ టూరేస్తారు..? తెలంగాణ ప్రచారంలో వాళ్లిచ్చే ఫినిషింగ్ టచ్ ఎలా ఉండబోతోంది? తాయిలాలు ఏమైనా ప్రకటిస్తారా? అన్నదీ హాట్‌టాపిక్‌గా మారింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ తోపాటు అన్ని పార్టీలకు చెందిన అతిరథ మహారధులు ఢిల్లీ టు గల్లీ.. అందరి ఫోకస్‌ తెలంగాణపైనే. నాలుగు రోజుల పాటు సుడిగాలి పర్యటనలతో తెలంగాణ దంగల్‌ని హీటెక్కించబోతున్నారు.

మే నెల 8వ తేదీన తెలంగాణకు రాబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఉదయం తొమ్మిది గంటలకు వేములవాడ, పదిన్నరకు వరంగల్ జిల్లా మడికొండలో పర్యటిస్తారు. పదవ తేదీ మళ్లీ తెలంగాణకొచ్చి.. మధ్యాహ్నం 2 గంటలకు నారాయణపేట, సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో జరిగే బహిరంగసభల్లో ప్రసంగిస్తారు. తెలంగాణ రాజకీయాలపై ఇటీవలే టీవీ9 నెట్‌వర్క్‌ ఇంటర్వ్యూలో మాట్లాడిన మోదీ, అదే వెర్షన్‌ని తుది విడత ప్రచారంలో రిపీట్ చేసే ఛాన్సుంది. రేవంత్ బడేభాయ్ కాన్సెప్ట్‌నీ, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఆప్షన్‌నీ మోదీ ప్రస్తావించవచ్చని తెలుస్తోంది.

హోంమంత్రి అమిత్‌షా ఇవాళ మధ్యాహ్నమే హైదరాబాద్ వస్తున్నారు. రెండు గంటలకు బేగంపేటలో దిగి.. ఆ వెంటనే కాగజ్‌నగర్‌లో జరిగే ఆదిలాబాద్ జనసభలో పాల్గొంటారు. సాయంత్రం నాలుగు గంటలకు నిజామాబాద్‌ గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ప్రసంగిస్తారు. సాయంత్రం హైదరాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో అమిత్‌షా సభ ఉండబోతోంది. దీంతో భారీగా జన సమీకరణతో సభ విజయవంతం చేసేందుకు బీజేపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అమిత్‌షా అలా వెళ్లిపోగానే, సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ చేరుకుంటారు. పెద్దపల్లి, భువనగిరి, నల్గొండల్లో పర్యటిస్తారు. వివిధ నియోజకవర్గాల్లో నిర్వహించే రోడ్ షోల్లో పాల్గొంటారు.

కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. గాంధీ ఫ్యామిలీని రంగంలోకి దింపుతోంది. చివరి విడతను సక్సెస్‌ఫుల్‌గా ముగించాలని ప్లాన్ చేసింది హస్తం పార్టీ. ఏఐసీసీ మాజీ ప్రెసిడెంట్ రాహుల్‌గాంధీ, జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ తెలంగాణలో పర్యటిస్తారు. ఇవాళ నిర్మల్, గద్వాల్‌ నియోజకవర్గాల్లో నిర్వహించే పబ్లిక్‌ మీటింగ్స్‌లో పాల్గొంటారు. మళ్లీ తొమ్మిదో తేదీన తెలంగాణకు తిరిగొచ్చు, కరీంనగర్‌, సరూర్‌నగర్‌లో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలకు రాహుల్‌గాంధీ హాజరవుతారు. ఇదే గ్యాప్‌లో ప్రియాంకగాంధీ కూడా సోమవారం తెలంగాణకు వస్తున్నారు. ఎల్లారెడ్డి, తాండూరులో పర్యటించి అదేరోజు సికింద్రాబాద్‌లో రోడ్‌షో నిర్వహిస్తారు. మే ఏడవ తేదీన నర్సాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలో సభలు, రోడ్‌షోల్లో పాల్గొంటారు ప్రియాంక గాంధీ.

మరోవైపు, తెలంగాణకు బీజేపీ ఇచ్చింది ఏమీ లేదంటూ గాడిద గుడ్డును చూపిస్తూ ప్రతీ పబ్లిక్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న కామెంట్లను బీజేపీ తీవ్రంగా తీసుకుంది. మోదీ, అమిత్‌షా నుంచి రియాక్షన్లు ఉండొచ్చని సంకేతాలిస్తోంది తెలంగాణ బీజేపీ. అటు.. ఎన్నికల తర్వాత కేంద్రంలో థర్డ్ ఫ్రంట్‌ పక్కా అంటున్న కేసీఆర్‌కి కౌంటర్లు ఇవ్వబోతున్నారు బీజేపీ-కాంగ్రెస్ అగ్రనేతలు. సో.. రాబోయే నాలుగు రోజులూ తెలంగాణ దంగల్‌లో దుమ్ముదుమారమే అన్నమాట.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..