Hyderabad: రాజేంద్రనగర్‌లో దారుణం.. పబ్లిక్ మీటింగ్‌లో కాంగ్రెస్ నేత మక్బుల్ హత్య

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇంద్ర నగర్ పరిధిలో ఎంఐఎం, కాంగ్రెస్ నాయకులు పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటన ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Hyderabad: రాజేంద్రనగర్‌లో దారుణం.. పబ్లిక్ మీటింగ్‌లో కాంగ్రెస్ నేత మక్బుల్ హత్య
Crime
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 05, 2024 | 11:12 AM

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇంద్ర నగర్ పరిధిలో ఎంఐఎం, కాంగ్రెస్ నాయకులు పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటన ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి ప్రచారానికి వచ్చారు. అదే సమయంలో భారీగా కాంగ్రెస్ నాయకులంతా ఇంద్రానగర్ పార్టీ కార్యాలయం వద్ద చేరుకున్నారు. స్థానికంగా ఉన్న నాయకులతో పాటు కార్యకర్తలు ప్రజలంతా భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలోనే మజ్లిస్, కాంగ్రెస్ నేతల వాగ్వివాదం చోటు చేసుకుంది. మక్బూల్ అనే వ్యక్తిపై అంజాద్ అనే వ్యక్తి దాడి చేశాడు. ఒక్కసారిగా ఎంఐఎం నాయకులు వచ్చి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులంతా వెంటనే స్థానిక హాస్పిటల్ కి తరలించారు

ఎంఐఎం పార్టీ ఉన్న అడ్డాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పెట్టడంతో, గత కొద్ది రోజులుగా కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా ఇంద్రానగర్‌లో గొడవలు పడుతున్నారు. ఇదిలావుంటే, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలోనే చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి రాక సందర్భంగా ప్రచారం నిర్వహించేందుకు స్థానిక కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేశారు. దీన్ని జీర్ణించుకోలేని కొందరు ఎంఐఎం నేత మక్బూల్ కత్తులతో ఇద్దరు వ్యక్తులపై దాడి చేశారు. ఈ హఠాత్ పరిణామంతో మీటింగ్ వచ్చిన ప్రజలంతా భయాందోళనలతో పరుగులు తీశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కాంగ్రెస్ నేత మక్బుల్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన మక్బుల్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles