Siddipet robbery: సినీ ఫక్కీలో చోరీ.. క్షణాల్లో లక్షలు మాయం చేసిన కేటుగాళ్లు

సినిమా స్టైల్లో కొందరు దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. యాక్టివా వాహనంలో ఉన్న డబ్బును ముగ్గురు వ్యక్తులు సినీ ఫక్కీలో దొంగలించారు. ఈ ఘటన సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Siddipet robbery: సినీ ఫక్కీలో చోరీ.. క్షణాల్లో లక్షలు మాయం చేసిన కేటుగాళ్లు
Siddipet Robbery
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 04, 2022 | 3:17 PM

సినిమా స్టైల్లో కొందరు దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. యాక్టివా వాహనంలో ఉన్న డబ్బును ముగ్గురు వ్యక్తులు సినీ ఫక్కీలో దొంగలించారు. ఈ ఘటన సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణం, నర్సాపూర్‌కు చెందిన కరొల్ల పర్మరాములు ఏపీజీవీబీ బ్యాంక్‌లో బ్యాంక్ మిత్రగా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం  పర్శ రాములు తన తండ్రితో కలిసి పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో గల ఏపీజీవీబీ బ్యాంక్‌లోంచి రూ.2లక్షల 49వేలు విత్ డ్రా చేసుకొని తన యాక్టివా వాహనంలోని ఢీక్కిలో పెట్టాడు. అనంతరం గాంధీ చౌరస్తాలోని చెప్పుల దుకాణంలో షాపింగ్ చేసుకొని తిరిగి వచ్చే సరికి యాక్టివా వాహనం కనబడక పోవడంతో వన్ పోలీస్ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు.

ఈమేరకు సీసీ పుటేజ్ పరిశీలించగా మగ్గురు వ్యక్తులు యాక్టివాను దొంగలించుకుని వెళ్లినట్టుగా తెలిసింది. దొంగలు వాహనాన్ని అక్కడ్నుంచి తరలించి బురుజు సమీపంలోని సఖీ సెంటర్ వద్ద స్కూటీ డిక్కీలోని డబ్బులు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బ్యాంకుకి వెళ్లిన సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, బ్యాంకు అధికారులు నిత్యం చెబుతూనే ఉంటారు. బ్యాంకుల బయట దొంగలు ఉంటారని, మీకు తెలీకుండా అజ్ఞాత వ్యక్తి మిమ్మల్ని నీడలా వెంటాడుతూ ఉంటాడని, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పదే పదే హెచ్చరిస్తూనే ఉంటారు. మీ డబ్బు జాగ్రత్తగా ఉంచుకోవాలని హెచ్చరిస్తూనే ఉంటారు. అయినా, కొందరు వ్యక్తులు నిర్లక్ష్యంగా వ్యవహరించో, ఏమరపాటుగా ఉండో.. అడ్డంగా బుక్కవుతున్నారు. కొద్ది పాటి నిర్లక్ష్యానికి కూడా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి