Nalgonda: లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..బస్సులో 42మంది ప్రయాణికులు..

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నార్కట్‎పల్లి 65వ జాతీయ రహదారిపై రోడ్డుపై ప్రయాణికులతో వెళ్తోన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో

Nalgonda: లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..బస్సులో 42మంది ప్రయాణికులు..
Accident
Follow us
Jyothi Gadda

| Edited By: Ravi Kiran

Updated on: Jul 04, 2022 | 3:18 PM

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నార్కట్‎పల్లి 65వ జాతీయ రహదారిపై రోడ్డుపై ప్రయాణికులతో వెళ్తోన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలు కాగా, పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికుల సహకారంతో సమీపంలోని కామినేని ఆస్పత్రికి తలిరంచారు. ప్రమాద సమయంలో 42 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గురైన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు రాజోలు నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

అటు, పాకిస్తాన్‌లోనూ ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిన ఘటనలో కనీసం 19 మంది మరణించారు. మరో 11 మంది గాయపడ్డారు. పాకిస్తాన్‌లోని Balochistan ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదానికి గురైన బస్సు ఇస్లామాబాద్ నుంచి క్వెట్టాకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిసింది. కి వర్షం కురుస్తూ ఉండటం, బస్సును డ్రైవర్ అతి వేగంతో నడపడమే ప్రమాదానికి కారణాలుగా భావిస్తున్నారు.