Dog Barked: పెంపుడు కుక్క అరిచిందని ఐరన్‌ రాడ్‌తో రెచ్చిపోయిన వ్యక్తి.. యజమాని సహా..

సాధారణంగా కొత్త వ్యక్తులు ఇంటి వైపు వస్తున్నపుడు కుక్కలు అరవడం మామూలే.. కానీ, కొందరు వాటి అరుపులకు బయపడిపోతుంటారు.. మరి కొందరు అవి మొరిగిన అవేం పట్టించుకోకుండా..

Dog Barked: పెంపుడు కుక్క అరిచిందని ఐరన్‌ రాడ్‌తో రెచ్చిపోయిన వ్యక్తి.. యజమాని సహా..
Dog Barked
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 04, 2022 | 10:43 AM

పెంపుడు కుక్కలంటే చాల మంది ప్రాణంగా భావిస్తారు. కుక్కని ఎవరైనా పేరు పెట్టి పిలిస్తే కూడా ఒప్పుకోరు..పెంపుడు కుక్కలను వారు ఇళ్లు, ఇంటి పెరట్లో వదిలిపెట్టేస్తుంటారు. దాంతో అవి ఇంటి ముందునుంచి వచ్చి పోయే వ్యక్తులను చూసి గ్రామసింహాలు గర్జిస్తూ ఉంటాయి. సాధారణంగా కొత్త వ్యక్తులు ఇంటి వైపు వస్తున్నపుడు కుక్కలు అరవడం మామూలే.. కానీ, కొందరు వాటి అరుపులకు బయపడిపోతుంటారు.. మరి కొందరు అవి మొరిగిన అవేం పట్టించుకోకుండా దైర్యంగా ముందుకు సాగుతారు. కానీ దేశరాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తి చేసిన పనికి అందరూ నివ్వెర పోయారు. కుక్క అరుపులు విసుగుపుట్టిస్తున్నాయని విచక్షణా కోల్పోయి ప్రవర్తించాడు. కుక్క యజమాని, ఇరుగుపొరుగుపై దాడి చేసి గాయపరిచాడు.

ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ ప్రాంతం నుండి కొన్ని షాకింగ్ ఫోటోలు బయటకు వచ్చాయి. కుక్క మొరిగిందనే కోపంతో ఒక వ్యక్తి ఇనుప రాడ్‌తో ఇరుగు పొరుగువారిపై దాడి చేశాడు.అంతటితో ఆగలేదు.. నిందితుడు కుక్కను కూడా రాడ్‌తో కొట్టి చంపేశాడు. స్థానికులు వద్దని వారించినప్పటికీ అతడు ఆగలేదు. మరింత రెచ్చిపోయి ప్రవర్తించాడు. అడ్డుపడ్డవారందరినీ విచక్షణారహితంగా చితకబాదేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని పశ్చిమ విహార్‌ ప్రాంతంలో చోటు చేసుకున్నట్టుగా తెలిసింది. ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

వ్యక్తి దాడిలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలైనట్టుగా తెలిసింది. ఈ తతంగమంతా అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. ఘటన తర్వాత కుక్క యజమాని ఇచ్చిన ఫిర్యాదుపై పశ్చిమ విహార్ ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గతంలో నైరుతి ఢిల్లీలోని దబ్రీ ప్రాంతంలో కుక్క విషయంలో రెండు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా వారి మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. జితేంద్ర పాండే, వినోద్ కుమార్‌ల కుటుంబం దబ్రీ ప్రాంతంలో నివసిస్తుంది. వినోద్‌ ఇంట్లో పెంచుకుంటున్న కుక్క తరచూ జితేంద్ర పాండే ఇంటి ముందు చెత్త చేస్తుందని వారు మండిపడ్డారు. జితేంద్ర పాండే తన కుటుంబ సభ్యులను పిలిచి వినోద్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో వినోద్‌ భార్య, కుమార్తెను కూడా కొట్టారు. ఈ ఘటనలో వినోద్, అతని భార్య, కుమార్తె గాయపడ్డారు.కుక్క యజమాని వినోద్‌, అతని భార్య, కుమార్తెపై దాడి చేశారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి