AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ట్రైన్‌లో తనిఖీలు చేస్తుండగా.. ఓ కోచ్‌లోని టాయిలెట్‌వైపు దూసుకెళ్లిన పోలీస్ డాగ్.. లోపల చూడగా

పంథా మార్చిన గంజాయి స్మగ్లర్లకు తమ మార్క్ ఝలక్ ఇస్తుంది రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్. ఇటీవల కాలంలో డాగ్ స్క్వాడ్‌కు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చింది.

Viral: ట్రైన్‌లో తనిఖీలు చేస్తుండగా.. ఓ కోచ్‌లోని టాయిలెట్‌వైపు దూసుకెళ్లిన పోలీస్ డాగ్.. లోపల చూడగా
representative image
Ram Naramaneni
|

Updated on: Jul 04, 2022 | 10:58 AM

Share

గంజాయి స్మగ్లర్స్ పంథా మార్చారు. రోడ్డు మార్గాల్లో తనిఖీలు విపరీతంగా పెరగడంతో.. కొత్త.. కొత్త రూట్స్ అన్వేశిస్తున్నారు. అధికారులకు చిక్కకుండా మత్తు పదార్థాలు తరలించేందుకు పుష్ప(Pushpa)ను మించి టెక్నిక్స్ వాడుతున్నారు. ముఖ్యంగా రైలు మార్గాలపై ఫోకస్ పెట్టారు. అన్ని ట్రైన్స్‌లో చెకింగ్స్ కష్టం కాబట్టి.. ఈ రూట్ సేఫ్ అని భావిస్తున్నారు. ఈ మధ్య ట్రైన్స్‌లో గంజాయి స్మగ్లింగ్ చేసేందుకు యత్నించి చాలామంది పట్టుబట్టారు. దీంతో ఈ అక్రమ రవాణాకు ఎలాగైనా చెక్ పెట్టాలని ఫిక్సయిన రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించింది. డ్రగ్స్ సహా ఇతర మాదక ద్రవ్యాలను గుర్తించేందుకు వాటికి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు. దీంతో కేటుగాళ్లను పట్టుకోవడం ఈజీగా మారింది. ఇందుకోసం RPF స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే జూలై  1న బదర్‌పూర్ రైల్వే స్టేషన్‌లో డాగ్ స్క్వాడ్ బృందం రైలు నంబర్ 15663లో తనిఖీ చేస్తున్నప్పుడు.. ఓ కుక్క ఓ కోచ్‌లోని వాష్ రూమ్‌వైపు పరుగులు తీసింది. ఆ టాయిలెట్‌లో అనుమానాస్పద బ్యాగ్‌ను గుర్తించింది RPF టీమ్. బ్యాగ్‌ని తెరిచి చూడగా, సుమారు రూ.30,000 విలువ చేసే సుమారు 3 కిలోల బరువున్న రెండు గంజాయి ప్యాకెట్లను గుర్తించారు పోలీసులు. తదుపరి చర్యల నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. కాగా జూన్ 30 నుంచి జూలై1 వరకు డాగ్ స్క్వాడ్‌ సాయంతో చేసిన తనిఖీల్లో వివిధ ఘటనల్లో రూ. 1.55 లక్షల విలువైన 15.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు RPF టీమ్ తెలిపింది.

Rpf

మరిన్ని జాతీయ వార్తలు చదవండి

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..