Telangana: మేడ్చల్ జిల్లాలో కాల్పుల కలకలం.. వైన్‌షాప్‌లోకి ప్రవేశించి తుపాకులతో..

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో దొంగల ముఠా ఫైరింగ్‌ కలకలం సృష్టించింది. ఓ వైన్‌షాప్‌లోకి చొరబడ్డ దుండగులు నిన్నరాత్రి భీభత్సం సృష్టించారు. తుపాకులతో బెదిరించి..

Telangana: మేడ్చల్ జిల్లాలో కాల్పుల కలకలం.. వైన్‌షాప్‌లోకి ప్రవేశించి తుపాకులతో..
Gun Firing
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 24, 2023 | 10:49 AM

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో దొంగల ముఠా ఫైరింగ్‌ కలకలం సృష్టించింది. ఓ వైన్‌షాప్‌లోకి చొరబడ్డ దుండగులు నిన్నరాత్రి భీభత్సం సృష్టించారు. తుపాకులతో బెదిరించి రూ.2 లక్షల దోపిడీ చేశారు దుండగులు. వైన్‌ షాప్‌ మూసివేసే సమయంలో వచ్చి, షాప్‌లో పనిచేస్తున్న సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు దోపిడీ దొంగలు. మేడ్చెల్ మూడు చింతలపల్లి మండలం ఉద్దెమర్రి దగ్గర జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

వైన్స్ షాప్‌ని మూసివేస్తుండగా వచ్చిన ముగ్గురు వ్యక్తులు షాప్‌ని మూసివేయొద్దంటూ అడ్డుతగిలారు. వారి చేతిలో ఉన్న డబ్బు బ్యాగ్‌ని లాక్కునేందుకు యత్నించారు. బ్యాగ్‌ ఇవ్వకపోవడంతో వారిపై పిడిగుద్దులు కురిపించారు. పెనుగులాట జరుగుతుండగానే ఓ వ్యక్తి గన్ తీసి రెండు రౌండ్లు కాల్పులు చేసాడు. డబ్బు ఇవ్వకుంటే చంపుతామని బెదిరించారు. కాల్పులు జరపడంతో బ్యాగ్ ఇచ్చేసి, బైక్ వెనక తలదాచుకున్నామని బాధితులు టీవీ9తో గోడును వెళ్లబోసుకున్నారు.

ఎవ్వరూ గుర్తుబట్టకుండా ఉండేందుకు మంకీ క్యాప్‌తో వచ్చిన ముగ్గురు దుండగులు సీసీ కెమెరాకి చిక్కారు. బయట ఉన్న కెమెరాని ధ్వంసం చేసినా, కెమెరాలో చిక్కిన దుండగుల దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఈ ఘటన తెలంగాణలో కలకలం రేపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..