Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gavvala Doctor: టీవీ9 కథనానికి రెస్పాన్స్.. గవ్వల డాక్టర్‎పై కలెక్టర్ సీరియస్.. ఇంకెప్పుడూ అలా చేయకుండా..

మహబూబాబాద్ జిల్లాలో గవ్వల డాక్టర్ ( ఆర్ఎంపీ ) వైద్యంపై జిల్లా కలెక్టర్ శశాంక్ సీరియస్ అయ్యారు. టీవీ9 లో వచ్చిన కథనాలు చూసిన ఆయన.. చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ ఆదేశాలతో కొత్తగూడ మండల కేంద్రంలోని...

Gavvala Doctor: టీవీ9 కథనానికి రెస్పాన్స్.. గవ్వల డాక్టర్‎పై కలెక్టర్ సీరియస్.. ఇంకెప్పుడూ అలా చేయకుండా..
Gavvala Doctor
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jan 24, 2023 | 12:22 PM

మహబూబాబాద్ జిల్లాలో గవ్వల డాక్టర్ ( ఆర్ఎంపీ ) వైద్యంపై జిల్లా కలెక్టర్ శశాంక్ సీరియస్ అయ్యారు. టీవీ9 లో వచ్చిన కథనాలు చూసిన ఆయన.. చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ ఆదేశాలతో కొత్తగూడ మండల కేంద్రంలోని విజయ క్లినిక్ ను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు. భూతవైద్యం చేస్తూ ఆర్ఎంపీగా చెలామణి అవుతున్న శ్యామ్ సుందర్ పై కేసు నమోదు చేశారు. ఇకపై ఆయన ఎటువంటి వైద్య కార్యక్రమాలు చేపట్టినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండల కేంద్రంలో. ఈయన పేరు శ్యామ్ సుందర్. ఆర్ఎంపీగా క్లినిక్ ప్రారంభించారు. తాను స్వయంగా ఆర్ఎంపీ డాక్టర్ గా ఉంటూనే.. బినామీ పేరిట మెడికల్ షాప్ నిర్వహిస్తుంటాడు. రెండు చేతులతో సంపాదిస్తూనే మూడో దందా కూడా తెరిచేశాడు. ఒక ఆర్ఎంపీ డాక్టర్.. నిబంధనల ప్రకారం ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ మాత్రమే చేయాలి. కానీ ఈయన మాత్రం చిన్నపిల్లలు, పెద్దవారికి కంటి వైద్యం కూడా స్టార్ట్ చేశారు.

భూత వైద్యుడిగానూ చెలరేగిపోయాడు. ఈయనే కాదు.. ఈయన తరఫున కొందరు ఇక్కడ తాయత్తులు కడుతూ.. వందలాది రూపాయలు గల్లాలో వేసుకుంటున్నారు. ఇటు తాయత్తులు అటు గవ్వలతో ఈ డబుల్ ఢమాకా డాక్టర్.. స్థానిక జనాల నుంచి ఎంత పెద్ద ఎత్తున కాసుల వసూళ్లు సాగించాలో అంతా చేస్తున్నారు. గవ్వలతో గండాన్ని గుర్తించామని.. తాయత్తుతో మీ చీడ పీడలన్నిటినీ పోగొట్టేస్తామని చెబుతూ ఇతడు చేసే వైద్యం ఈ ప్రాంతంలోనే అతి పెద్ద చర్చనీయాంశంగా మారింది.

దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన టీవీ9.. ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు కథనాలను ప్రసారం చేసింది. వీటిని చూసిన జిల్లా కలెక్టర్.. భూత వైద్యుడిపై చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించారు. కాగా.. అనారోగ్యానికి గురైతే డాక్టర్లను కన్సల్ట్ అవ్వాలి గానీ..ఇలా భూతవైద్యులనో, బాబాలనో కాదనే విషయాన్ని గుర్తించాలి. గుడ్డిగా ఏది పడితే అది నమ్మకుండా వాస్తవాలను గ్రహించాలంటున్నారు ఉన్నతాధికారులు. మాయమాటలు నమ్మి మోసపోయి వారు ఉన్నంత వరకు ఇలాంటి వారి ఆగడాలు కొనసాగుతూనే ఉంటాయని, మార్పు అనేది ప్రజల్లోనే రావాలని సూచిస్తున్నారు ఆఫీసర్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..