Telangana: ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. డీఏ, డీఆర్ పెంచిన తెలంగాణ సర్కార్.. వివరాలివే..!

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెప్పింది తెలంగాణ సర్కార్. కరువు భత్యం(DA/DR) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు మేరకు ప్రభుత్వం.

Telangana: ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. డీఏ, డీఆర్ పెంచిన తెలంగాణ సర్కార్.. వివరాలివే..!
CM KCR
Follow us

|

Updated on: Jan 23, 2023 | 7:46 PM

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెప్పింది తెలంగాణ సర్కార్. కరువు భత్యం(DA/DR) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు మేరకు ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం 2.73 శాతం పెంచుతూ నిర్ణయించింది ప్రభుత్వం. తాజా పెంపుతో.. ప్రస్తుతం ఉన్న 17.29 శాతం డీఏ/డీఆర్ 20.02 శాతానికి పెరిగింది. పెరిగిన మొత్తాన్ని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 4.40 లక్షల మంది ఉద్యోగులు, 2.88 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. కాగా, ఈ పెంపు 1 జులై, 2022 నుంచి వర్తించనుంది.

ట్వీట్ చేసిన మంత్రి హరీష్ రావు..

ఇదే విషయాన్ని పేర్కొంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. డీఏ/డీఆర్ పెంపునకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను పోస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

మంత్రి హరీష్ రావు ట్వీట్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..